Azadi Ka Amrit Mahotsav: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. పింగళి వెంకయ్యకు ఘన నివాళులు

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య (Pingali Venkaiah) జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో...

Azadi Ka Amrit Mahotsav: త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్.. పింగళి వెంకయ్యకు ఘన నివాళులు
Cm Jagan

Updated on: Aug 02, 2022 | 12:47 PM

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్ వేడుకల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర్య సమరయోధుడు పింగళి వెంకయ్య (Pingali Venkaiah) జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి (CM Jagan).. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పింగళి వెంకయ్య జీవితంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. జాతీయ పతాకాన్ని రూపొందించిన తెలుగు వ్యక్తి పింగళి వెంకయ్య దేశ ప్రజలందరూ గర్వపడేలా చేశారని సీఎం అన్నారు. కుల‌, మ‌త, ప్రాంతాల‌క‌ు అతీతంగా త్రివ‌ర్ణ ప‌తాకాన్ని గుండెల నిండా పెట్టుకున్న దేశ ప్రజలంద‌రికీ సెల్యూట్ చేస్తున్నానని చెప్పారు. కాగా.. ఆజాదీ కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్య్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. అయితే.. ఆగస్టు 2న ఆయన జయంతి సందర్భంగా స్వగ్రామం భట్లపెనుమర్రులో నివాళి అర్పించేందుకు సరైన ఏర్పాట్లు లేకపోవడం ఆవేదన కలిగిస్తోంది.

కాగా.. ఈ సారి పింగళి వెంకయ్య జయంతిని కేంద్రమే నిర్వహిస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి చెప్పారు. భట్లపెనుమర్రును సందర్శించిన ఆయన ఈ కామెంట్స్ చేశారు. గ్రామంలో నిర్వహించిన సభలో పింగళి వెంకయ్య మనవరాలు సుశీలను సన్మానించారు. ఆగస్టు 2న (ఇవాళ) ఢిల్లీలో వేలాది మందితో జరిగే పింగళి వెంకయ్య శత జయంతి సభకు రావాలని ఆయన మనవరాలిని, కుటుంబ సభ్యులను, గ్రామస్తులను కేంద్ర మంత్రి ఆహ్వానించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..