Andhra Pradesh: “ప్రగతి అనేది అంకెల రూపంలో కాదు.. వాస్తవ రూపంలో ఉండాలి”.. సీఎం జగన్..

గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రగతి అనేది కేవలం అంకెల రూపంలో చూపించడం..

Andhra Pradesh: ప్రగతి అనేది అంకెల రూపంలో కాదు.. వాస్తవ రూపంలో ఉండాలి.. సీఎం జగన్..
Cm Ys Jagan

Updated on: Oct 31, 2022 | 9:37 PM

గ్రామ, వార్డు సచివాలయాల రూపంలో ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి అన్నారు. ప్రగతి అనేది కేవలం అంకెల రూపంలో చూపించడం కాదన్న ఆయన వాస్తవ రూపంలో ఉండాలని అధికారులకు చురకలు అంటించారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా చేస్తున్న ప్రగతికి సంబంధించిన వివరాలను నమోదు చేయాలని, ఇది చాలా ముఖ్యమనే విషయాలన్ని గుర్తు పెట్టుకుని ప్రవర్తించాలని ఆదేశించారు. సుస్థిర అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్‌ను ఫస్ట్ ప్లేస్ లో నిలపాలన్నదే అందరి లక్ష్యమని, ఆ దిశగా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఈ ఆదేశాలు జారీ చేశారు. సుస్థిర లక్ష్యాల సాధనలో భాగంగా గ్రామ వార్డు సచివాలయాలను యూనిట్‌గా చేయాలని చెప్పారు. అక్కడి సిబ్బందిని పూర్తి స్థాయిలో భాగస్వాములు చేయాలని చెప్పారు. లక్ష్యాల సాధనపై ప్రతి నెలకు ఒక సారి వివరాలు నమోదు కావాలని దీని కోసం ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ లాంటి సాంకేతికతను వాడుకోవాలని స్పష్టం చేశారు.

పిల్లలు బడి మానేశారన్న మాట ఎక్కడా వినిపించకూడదు. దీనిపై అధికారులు దృష్టి పెట్టాలి. పిల్లలు వరసగా 3 రోజులు స్కూలుకు రాకపోతే ఇంటికివెళ్లి ఆరా తీయాలి. తల్లిదండ్రులకు ఎస్‌ఎంఎస్‌లు పంపించాలి. ఆధార్‌ కార్డు నంబరు, వివరాలతో సహా డేటా సేకరించాలి. వివరాల నమోదు సమగ్రంగా ఉంటేనే.. అభివృద్ధిలో ఏ స్థాయిలో ఉందో, లక్ష్యాల సాధన దిశలో ఎక్కడున్నామో స్పష్టంగా తెలుస్తుంది. సచివాలయాల్లో సిబ్బంది పని తీరుపై పర్యవేక్షణకు మండలాల వారీగా వివిధ విభాగాలకు చెందిన అధికారులు ఉండాలి. వీరు సచివాయాల్లోని ఆయా విభాగాలకు చెందిన సిబ్బంది పనితీరును పర్యవేక్షించాలి. ఎప్పటికప్పుడు వివరాల నమోదు కూడా సమగ్రంగా జరుగుతుందా? లేదా? అన్నదానిపై కూడా పరిశీలన, పర్యవేక్షణ జరుగుతుంది.

– వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

మరోవైపు.. ప్రజా సమస్యలను నేరుగా ముఖ్యమంత్రే స్వీకరించేలా సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ప్రజల నుంచి ఫిర్యాదులు, సూచనలు, సలహాలు తీసుకునేలా ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ప్రారంభించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు, అధికారులతో సీఎం చర్చించాలి. కార్యక్రమం ఎలా నిర్వహించాలనే అంశంపై అభిప్రాయాలు సేకరించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం..