CM Jagan: పోలవరం మెయిన్ కెనాల్‌పై ఫోకస్ పెట్టండి.. ఇరిగేషన్‌ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..

Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌పై కూడా దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. ECRFb డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపిన అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం జగన్..

CM Jagan: పోలవరం మెయిన్ కెనాల్‌పై ఫోకస్ పెట్టండి.. ఇరిగేషన్‌ అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు..
CM Jagan

Updated on: Jun 19, 2023 | 5:00 PM

అమరావతి, జూన్ 19: ఇరిగేషన్‌పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతున్న కొద్దీ లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌పై కూడా దృష్టిపెట్టాలన్నారు సీఎం జగన్. ECRFb డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపిన అధికారులకు పలు సూచనలు చేశారు సీఎం జగన్. ఈసీఆర్ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-1లో శాండ్‌ ఫిల్లింగ్‌, వైబ్రోకాంపాక్షన్‌ పనులు పూర్తయ్యాయని వెల్లడించారు అధికారులు. గ్యాప్‌-2 వద్ద కూడా పనులు చురుగ్గా సాగుతున్నాయని వెల్లడించారు అధికారులు. కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్‌ బండ్‌లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని వెల్లడించారు అధికారులు.

నేల స్వభావంలో మార్పలు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని అనుమానాన్నికమిటీ వెళ్లడించిన విషయాన్ని గుర్తు చేశారు. పోలవరం తొలిదశను పూర్తిచేయడానికి కేంద్ర ఆర్థికశాఖ రూ. 12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. పోలవరం తొలి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.

ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తి ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం సీఎం ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల ప్రగతిని సమీక్షించుకోవలన్నారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం