Andhra Pradesh: పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఊరట.

|

Feb 18, 2023 | 6:54 AM

పేద ప్రజలకు అత్యతం నాణ్యమైన ఇళ్లను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎమ్‌ ఈ విషయాలను వెల్లడించారు...

Andhra Pradesh: పేదలకు ఇళ్ల నిర్మాణం విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వారందరికీ ఊరట.
Andhra Pradesh Cm Jagan
Follow us on

పేద ప్రజలకు అత్యతం నాణ్యమైన ఇళ్లను అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎమ్‌ ఈ విషయాలను వెల్లడించారు. ఇళ్ల నిర్మాణం, టిడ్కో ఇళ్లపై అధికారులతో సమీక్షించారు. సీఎం సమీక్షా సమావేశంలో మంత్రులు జోగి రమేష్, ఆదిమూలపు సురేష్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ బోర్డు కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్‌ డాక్టర్‌ కే ఎస్‌ జవహర్‌ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సొంత ఇల్లు అనేది పేదవాడి కల, ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి లోపం ఉండకూడదని అధికారులను సీఎమ్‌ జగన్‌ ఆదేశించారు. ల్యాబ్స్‌ను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలను నిర్వహించి, పేదవాడికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలన్నారు. లే అవుట్లలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసిన తర్వాత, వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలన్నారు. లే అవుట్లు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకుసాగాలని అధికారులను సూచించారు.

కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని 2 లే అవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామని అధికారులు తెలిపారు. సుమారు 30 వేలమందికి ఇళ్ల నిర్మాణంలో కోర్టు కేసుల కారణంగా జాప్యం జరిగిందని, వీరికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇందుకు అసవరమైన భూ సేకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ ఆదేశించారు. వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబర్‌ నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని సీఎం తో వివరించారు అధికారులు. ఇళ్ల నిర్మాణంలో ఎలాంటి నాణ్యతా లోపం లేకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..