Vizag: రూ. 4కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం..

| Edited By: Ravi Kiran

Dec 16, 2024 | 11:03 AM

అసలే చలికాలం.. ఆపై ఏదైనా వేడివేడిగా తినాలని అనిపిస్తుంది. సరిగ్గా ఓ హోటల్ ఇదే అనుకుంటున్నట్టు ఉంది.. ఓపెనింగ్ ఆఫర్ కింద నాలుగు రూపాయలకే బిర్యానీ అని అనౌన్స్ చేసింది.. అంతే.. ఇంకేముంది..

Vizag: రూ. 4కే వేడి వేడి చికెన్ బిర్యానీ.. భారీగా క్యూ కట్టిన జనం..
Biryani
Follow us on

అసలే చలికాలం.. అందులో వేడి వేడి చికెన్ దమ్ బిర్యానీ గుమగుమలాడితే నోరూరుతుంది కదా..! అది కూడా కేవలం నాలుగు రూపాయలకే మంచి చికెన్ దమ్ బిర్యాని ఇస్తే..! ఇక చెప్పేదేముంది.. అందరూ ఆ రెస్టారెంట్ వైపు పరుగు తీశారు. ఏకంగా ఫ్యామిలీ ఫ్యామిలీలే క్యూ కట్టారు. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా నాలుగు రూపాయల బిర్యానీ కోసం పోటీ పడడంతో ఆ క్యూ లైన్ కాస్త కిలోమీటర్లు చేరింది.

ఇది చదవండి: మీరు నిజంగానే తోపులైతే.. ఈ ఫోటోలో దాగున్న నెంబర్ కనిపెట్టగలరా.?

ఇదిగో ఈ లైన్ అంతా ఏదో కొత్త సినిమా రిలీజ్ అయిందని సినిమా టికెట్ల కోసం కాదు.. భక్తితో దేవుడి దర్శనం కోసం గుడిలో క్యూలైన్ అంతకంటే కాదు.. ఇది కేవలం బిర్యాని కోసం మాత్రమే. ఇంతలా ఎగబడి గంటలకొద్దీ వేచి చూస్తున్న వీరంతా వేడివేడి బిర్యానీ తినాలని అనుకున్నారు. అది కూడా వందల్లో అయితే ఈ మాత్రం ఉండదు మరి.. కేవలం ఓపెనింగ్ ఆఫర్‌లో నాలుగు రూపాయలకే బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ ఇవ్వడంతో క్యూ కట్టారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ సమీపంలో ఓ హోటల్ ప్రారంభోత్సవం జరిగింది. నిర్వాహకులు నాలుగు రూపాయలకి చికెన్ బిర్యానీ ప్యాకెట్ ఆఫర్ ప్రకటించారు. జనం భారీగా తరలివచ్చారు. బిర్యానీ ప్యాకెట్ కోసం ఫ్యామిలీ ప్యాక్ సిద్ధమైపోయింది. దీంతో ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్యాకెట్ మాత్రమే కండిషన్ పెట్టారు. రోడ్డుపై రద్దీ పెరగడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..