Andhra Weather: ఆంధ్రాలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా..

|

Jan 03, 2025 | 3:22 PM

జనవరి నుంచి మార్చి వరకు ఆంధ్రప్రదేశ్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి సీజన్‌లో దేశంలోని కాలానుగుణ వర్షపాతం చాలా వరకు సాధారణంగా ఉంటుంది. అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్‌), పార్వతీపురం మన్యం జిల్లాల్లోని కొండ ప్రాంతాల్లోని కొన్ని ప్రాంతాల్లో జనవరి రెండో వారం నుంచి పొగమంచు ఎక్కువగా ఉంటుందని, మూడు నాలుగు రోజుల పాటు పొగమంచు వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు.

Andhra Weather: ఆంధ్రాలో వచ్చే 3 రోజులు వాతావరణం ఇలా..
Andhra Weather Report
Follow us on

ఆంధ్ర ప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఇప్పుడు తెలుసుకుందాం…

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

శుక్రవారం:- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

శనివారం, ఆదివారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

శుక్రవారం:-  పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. పొగమంచు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

శనివారం, ఆదివారం :- పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది

రాయలసీమ :-

శుక్రవారం, శనివారం, ఆదివారం :-  పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి