Cheating Case: రెచ్చిపోయిన కేటుగాళ్లు.. 4000 వేల గొర్రెలతో పరార్.. ఆ తర్వాత మరో ట్విస్ట్..

|

Oct 05, 2021 | 11:58 AM

Cheating Case: మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో అమాయక జనాలను నమ్మించి నట్టేట ముంచుతున్నారు.

Cheating Case: రెచ్చిపోయిన కేటుగాళ్లు.. 4000 వేల గొర్రెలతో పరార్.. ఆ తర్వాత మరో ట్విస్ట్..
Cheating Case
Follow us on

Cheating Case: మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. మాయమాటలతో అమాయక జనాలను నమ్మించి నట్టేట ముంచుతున్నారు. జనాల నమ్మకాన్నే సొమ్ము చేసుకుని చెలరేగిపోతున్నారు దుండగులు. తాజాగా ఇద్దరు కేటుగాళ్లు.. గొర్రెల కాపరులను నమ్మించి నట్టేట ముంచారు. సుమారు 4వేలకు పైగా గొర్రెలతో ఉడాయించారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితులైన దిమ్మేటి రామకృష్ణ, బొంబాయి కాజా.. అమాయక గొర్రెల కాపరులే లక్ష్యంగా తమ దోపిడీకి ప్లాన్ వేశారు. ఎక్కువ ధరకు గొర్రెలు అమ్మిపెడతామంటూ గొర్రెల కాపరులను ఊదరగొట్టారు. వారిని నమ్మించి, వారి వద్దనున్న గొర్రెలను తమ వాహనంలో ఎక్కించుకెళ్లేవారు. ఆ తరువాత తమ జాడ కూడా తెలియకుండా పరారయ్యేవారు. ఇలా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన 50 మంది గొర్రెల కాపరులు ఆ ఇద్దరు కేటుగాళ్ల చేతిలో మోసపోయారు.

దాదాపు 3 కోట్ల విలువైన గొర్రెలతో దుండగులు పరార్ అవడం విశేషం. ఇదిలాఉంటే.. మరికొందరు దుండగులు మీడియా ముసుగులో మోసపోయిన కాపరులను మరోసారి వంచించారు. గొర్రెలను కోల్పోయిన పుట్టెడు బాధలలో ఉన్న కాపరులకు పోలీసుల వద్ద న్యాయం జరిగేలా చూస్తామంటూ కొందరు వ్యక్తులు ముందుకువచ్చారు. తాము మీడియా వ్యక్తులమంటూ.. పోలీసులకు, జర్నలిస్టులకు డబ్బులు ఇవ్వాలంటూ వారి నుంచి రూ. 20 వేలు తీసుకున్నారు. ఆ తరువాత అడ్రస్ లేకుండా పోయారు. దీంతో బాధిత గొర్రెల కాపరులు పెదవేగి పోలీస్ స్టేషన్‌లో తమను మోసం చేసినవారిపై ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి నేరుగా పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీని ఆశ్రయించారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. తమకు న్యాయం చేయాలని ఎస్సీని వేడుకున్నారు. మోసపోయిన వారిలో కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన వారు ఉండటంతో.. రెండు జిల్లాల పోలీసులు యంత్రాంగం సమన్వయంతో కేసులు డీల్ చేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ వారికి హామీ ఇచ్చారు.

Also read:

TSRTC: టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. దసరా పండుగకు 4,045 ప్రత్యేక బస్సులు..

Zodiac Signs: ఇతరులతో ఇట్టే కలిసిపోతారు.. ఈ నాలుగు రాశుల వారి ప్రత్యేకతే వేరు..

Tea Types: ‘టీ’లో రకాలు.. ఆరోగ్యానికి ఎన్ని విధాలుగా ప్రయోజనాలో మీకు తెలుసా?..