AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CID: చంద్రబాబుపై మరో చార్జ్ షీట్.. ఎన్నికల వేళ ఏసీబీ కోర్టులో కీలక పరిణామం..

ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. అందులో A 1 గా చంద్రబాబు నాయుడు, A 2గా వేమూరి హరి కృష్ణ, A 3గా కోగంటి సాంబ శివ రావులను చేర్చింది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. గతంలో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తన పాలనలోని పలు ప్రాజెక్టులపై ఏసీ సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది.

AP CID: చంద్రబాబుపై మరో చార్జ్ షీట్.. ఎన్నికల వేళ ఏసీబీ కోర్టులో కీలక పరిణామం..
Chandrababu Naidu
Srikar T
|

Updated on: Feb 17, 2024 | 9:30 AM

Share

ఏపీ ఫైబర్ నెట్ స్కామ్ కు సంబంధించి ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ. అందులో A 1 గా చంద్రబాబు నాయుడు, A 2గా వేమూరి హరి కృష్ణ, A 3గా కోగంటి సాంబ శివ రావులను చేర్చింది. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. గతంలో అధికారం కోల్పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు అనేక కేసుల్లో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. తన పాలనలోని పలు ప్రాజెక్టులపై ఏసీ సీఐడీ దర్యాప్తు వేగవంతం చేసింది. గతంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు రాజమండ్రి జైలులలో రిమాండ్ అనుభవించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే మరో కేసు తెలుగుదేశం అధినేత చంద్రబాబును వెంటాడుతోంది. ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణంలో చంద్రబాబును ఏ1 గా చేరుస్తూ ఏసీబీ కోర్టులో చార్జ్ షీట్ దాఖలు చేసింది ఏపీ సీఐడీ.

చంద్రబాబు కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ. 114 కోట్లు నష్టం వాటిల్లిందని ఛార్జ్ షీట్‎లో పేర్కొన్నారు సీఐడీ అధికారులు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ. 330 కోట్లు కాగా రూ. 114 కోట్లు చంద్రబాబు కారణంగా నష్టం వాటిల్లిందని ఆరోపించారు. చంద్రబాబు కనుసన్నల్లోనే ఫైబర్ నెట్ స్కాం జరిగిందని ఏపీ సీఐడీ చార్జ్ షీట్లో పేర్కొంది. వేమూరి హరి కృష్ణని నిబంధనలకు విరుద్దంగా ఫైబర్ నెట్ కార్పొరేషన్ డైరెక్టర్‎గా నియమించారని తెలిపింది. ఉద్దేశ పూర్వకంగానే చంద్రబాబు.. హరి కృష్ణని నియమించారని తెలిపింది. విధి విధానాలు పాటించకుండా ఫైబర్ నెట్ ప్రాజెక్ట్‎కు చంద్రబాబు అనుమతులు ఇచ్చారని పేర్కొంది. ప్రాజెక్ట్‎ను వేమూరి హరి కృష్ణకు ఇచ్చేలా ప్రాజెక్ట్ అధికారులపై ఒత్తిడి తెచ్చారని తెలిపారు సీఐడీ అధికారులు.

టెండర్ల ఎస్టిమేషన్ కమిటీలో హరి ప్రసాద్‎ను నియమించాలని చంద్రబాబు ఒత్తిడి తెచ్చారని ఆరోపించింది. వేమూరి హరి కృష్ణ టేరాసాఫ్ట్ కంపెనీనీ బ్లాక్ లిస్ట్‎లో నుంచి తొలగించాలని ఒత్తిడి తెచ్చి టేరా సాఫ్టు‎కు ఈ ప్రాజెక్ట్ వచ్చేలా ప్లాన్ చేశారని పేర్కొంది. మిగతా కంపెనీలు టెండర్ దాఖలు చేసిన వాళ్ళని కాదని వేమూరి హరి కృష్ణకు టెండర్ దక్కేలా చేశారని చెప్పింది. సీనియర్ ఐఏఎస్ అధికారి టెండర్ ప్రక్రియలో అక్రమాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే అతన్ని ట్రాన్స్ఫర్ చేశారని తెలిపింది. స్కాం ద్వారా కొల్లగొట్టిన నగదును షెల్ కంపెనీల ద్వారా సొంత ఖాతాలకు మళ్లించారని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు ఎసిబి కోర్టు, ఏపీ హై కోర్టు ముందస్తు బెయిల్‎ను తిరస్కరించింది. చంద్రబాబు ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఫైబర్ నెట్ కేసుపై స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసినట్లు సీఐడీ తన ఛార్జ్ షీట్‎లో పొందుపరిచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..