AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bihar: జముయి ఘటన నిందితుల ఎన్‌కౌంటర్.. ప్రధాన నిందితుడికి బుల్లెట్ గాయం!

బీహార్‌లోని జముయి మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన నందన్ యాదవ్ మంగళవారం (సెప్టెంబర్ 22) పోలీసులతో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డాడు. ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ కాలికి బుల్లెట్ గాయం కాగా, రెండో నిందితుడు హరేరామ్ యాదవ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Bihar: జముయి ఘటన నిందితుల ఎన్‌కౌంటర్.. ప్రధాన నిందితుడికి బుల్లెట్ గాయం!
Jamui Minor Harassment Case
Balaraju Goud
|

Updated on: Sep 22, 2026 | 1:34 PM

Share

బీహార్‌లోని జముయి మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కేసులో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించిన నందన్ యాదవ్ మంగళవారం (సెప్టెంబర్ 22) పోలీసులతో జరిగిన కాల్పుల ఘటనలో గాయపడ్డాడు. ప్రధాన నిందితుడు నందన్ యాదవ్ కాలికి బుల్లెట్ గాయం కాగా, రెండో నిందితుడు హరేరామ్ యాదవ్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. వారిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల కథనం ప్రకారం, నిందితుడి గురించి బలమైన సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా పోలీసులు నిందితుడిని చుట్టుముట్టారు. కానీ నిందితుడు పోలీసు బృందంపై కాల్పులు జరుపుతూ పారిపోయాడు. పోలీసులు ఎదురు కాల్పులు జరపడంతో ప్రధాన నిందితుడైన నందన్ కాలికి బుల్లెట్ గాయమైంది. అతడిని వెంటనే అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనలో పారిపోతున్న సమయంలో రెండో నిందితుడు హరేరామ్ యాదవ్ కూడా గాయపడ్డాడు. అతని కాలు బెణికింది. ఈ కేసులో ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతనిని రామాశిష్ చౌదరిగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడనే ఆరోపణపై అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ వీడియో కారణంగానే నిందితుడు నందన్‌ను కూడా గుర్తించారు.

ఇదిలావుంటే, సెప్టెంబర్ 19న జముయి ప్రాంతంలో కోచింగ్‌ నుంచి తిరిగి వస్తున్న పదో తరగతి చదువుతున్న బాలుడు, బాలికను కొందరు అడ్డుకుని వేధించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులను గుర్తించే ప్రక్రియ ప్రారంభించారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరికొందరి కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గాలింపు కొనసాగిస్తోంది. జముయి ఎస్పీ విశ్వజీత్ దయాల్ నేతృత్వంలో పోలీసులు వీడియోలో కనిపించిన పలువురిని గుర్తించినట్లు తెలిపారు.

బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఆరోపణల నేపథ్యంలో POCSO చట్టం, భారతీయ న్యాయ సంహిత (BNS)లోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదైంది. అలాగే మైనర్లకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా పోలీసులు ప్రజలను హెచ్చరించారు. వీడియోను తొలగించేందుకు కూడా చర్యలు చేపట్టారు.ఇదిలా ఉండగా, ఘటనపై బీహార్ మహిళా కమిషన్ జిల్లా యంత్రాంగం నుంచి వివరణాత్మక నివేదిక కోరింది. కేసులో మిగిలిన నిందితుల కోసం పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us