AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా.. ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

తిరుపతి జిల్లా చంద్రగిరిలోని బ్రహ్మంగారి గుడి సమీపంలో తవ్వకాలు జరుపుతుండగా అరుదైన అపరకాళి విగ్రహం వెలుగుచూసింది. ఆరు భుజాలు, ఆరు ఆయుధాలతో చండప్రచండ స్వరూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. రాక్షసుడిని కాళ్ల కింద తొక్కుతూ వధిస్తున్నట్లుగా విగ్రహ రూపం ఉంది. విగ్రహం లోహం, కాలం వంటి వివరాలను నిర్ధారించేందుకు పురావస్తుశాఖ అధికారులు పరిశీలనలు చేస్తున్నారు. విషయం తెలియడంతో స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పూజలు చేస్తున్నారు.

బ్రహ్మంగారి గుడిలో పనులు చేస్తుండగా.. ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
Brahmamgari Temple In Chandragiri
Shaik Madar Saheb
|

Updated on: Aug 31, 2026 | 11:53 AM

Share

తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిపిన తవ్వకాల్లో అపరకాళి విగ్రహం లభ్యమైంది. బ్రహ్మంగారి గుడి దగ్గర ఉపాధి హామీ పనులు చేస్తుండగా అపరకాళి విగ్రహం వెలుగుచూసింది.. ఆరుభుజాలు, ఆరు అస్త్రాలతో చండప్రచండ స్వరూపంతో అమ్మవారి రూపం ఉండటం అందరినీ.. ఆశ్చర్యానికి గురిచేసింది. కాళ్లకింద తొక్కిపడుతూ రాక్షసుడ్ని వధిస్తున్నట్లుగా విగ్రహ స్వరూపం ఉంది. కాగా.. విగ్రహాన్ని వెలికి తీసిన స్థానికులు.. దానిని పండితుల ఆధ్వర్యంలో శుద్ధి చేసి పూజలు చేశారు. పంచలోహమా.. లేక మరోదైనా మెటలా..? అని తేల్చేపనిలో పురావస్తుశాఖ నిమగ్నమైంది.. ఈ అపరకాళి విగ్రహం ఎన్నేళ్ల కాలంనాటిదో తెలుసుకునేందుకు అధికారుల పరిశీలన మొదలైంది. బ్రహ్మంగారి గుడి దగ్గర అపరకాళి విగ్రహం లభ్యమైందన్న విషయం తెలుసుకుని.. స్థానికులు, చుట్టుపక్కల ప్రాంతాల వారు.. అక్కడి చేరుకుని అమ్మవారికి పూజలు చేస్తున్నారు.

కాగా.. ఇది పురాతన కాలం విగ్రహమేనని పలువరు పేర్కొంటున్నారు. చండప్రచండ స్వరూపం గల విగ్రహం చాలా అరుదుగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు. కాగా.. అంతకుముందు కూడా తవ్వకాల్లో పలు విగ్రహాలు లభ్యమయ్యాయని పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ ప్రాంతంలో అపరకాళి విగ్రహం కనిపించడం సంచలనంగా మారింది.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us