Chandrababu Naidu: జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ఇవ్వాలి.. ముఖ్యమంత్రిపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మండిపడ్డారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన..

Chandrababu Naidu: జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ఇవ్వాలి.. ముఖ్యమంత్రిపై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్..
Chandrababu

Updated on: Feb 17, 2023 | 7:15 AM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ పై మాజీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. సీఎం జగన్ ఆర్థిక విధానాలకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని మండిపడ్డారు. కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగిన రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబు.. వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో రోడ్లు సరిగ్గా లేవని చంద్రబాబు ఆక్షేపించారు. జగన్ రూ.10 ఇచ్చి రూ. 100 లాక్కుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ నిలువు దోపిడీకి ప్రజలు బలయిపోతున్నారని.. తన జీవితంలో ఇంత దోపిడీదారున్ని ఎప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం చేసిన రూ.10 లక్షల కోట్ల అప్పులను ప్రజలే కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని చంద్రబాబు వివరించారు.

రానున్న ఎన్నికల్లో జగన్‌ ఇంటికి పోవడం ఖాయం. రైతులపై తలసరి అప్పు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు ఉంది. టీడీపీ పాలనలో అభివృద్ధి, సంక్షేమం, బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి ప్రాధాన్యం ఇచ్చాం. కానీ వైసీపీ పాలనలో మాత్రం గంజాయి బ్యాచ్‌లు, మద్యం బ్యాచ్‌లు, ఇసుక, భూమాఫియా, భూదందాలకు ప్రాధాన్యం ఇస్తోంది.

– చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

రాష్ట్రంలో కుటుంబ సాధికార సారథుల పేరిట కొత్త వ్యవస్థకు శ్రీకారం చుడుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రతి 30 కుటుంబాలకు ఒకరు సారథులుగా వ్యవహరిస్తారని.. ఆర్థిక అసమానతలు తొలగించేలా పనిచేస్తారని చెప్పారు. 40 ఏళ్లుగా తనను గౌరవించిన ఈ పార్టీ కోసం.. ప్రజల కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల కోసం టీడీపీని సిద్ధం చేసేందుకు ఇకపై సమీక్షలు నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..