Amaravati: ఆకట్టుకుంటున్న అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మాణ నమూన.. బలే ఉన్నాయిగా బిల్డింగ్స్!

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన భవన నమూనాలను సచివాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు సమీక్షించారు. అమరావతిని టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది.

Amaravati: ఆకట్టుకుంటున్న అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మాణ నమూన.. బలే ఉన్నాయిగా బిల్డింగ్స్!
Amaravati Quantum Valley

Edited By: Anand T

Updated on: Nov 24, 2025 | 5:52 PM

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన భవన నమూనాలను సచివాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు సమీక్షించారు. అమరావతిని టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది. లింగాయపాలెం సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటం వ్యాలీ నిర్మాణం జరగనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచే ఇక్కడ ప్రాథమిక స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల పనుల్లో అధికారులు దీంతోపాటు వేగం పెంచుతున్నారు.

క్వాంటం వ్యాలీ ప్రధాన భవనం చుట్టూ ఎనిమిది టవర్లు నిర్మించనున్నారు. మొత్తం 80 లక్షల చదరపు అడుగుల ప్రాంతంలో ఈ భవనాలు రూపుదిద్దుకుంటాయి. పరిశోధన సంస్థలు, స్టార్టప్‌లు, టెక్ కంపెనీలకు వీటిలో చోటు ఉండనుంది. అమరావతి పేరుకి సంకేతంగా ప్రధాన భవనాన్ని “A” అక్షర ఆకారంలో డిజైన్ చేస్తున్నారు.

ప్రధాన భవన నిర్మాణం 45 వేల అడుగుల విస్తీర్ణంలో జరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఉండే ఈ సెంట్రల్‌ నిర్మాణం, భవిష్యత్తు టెక్ రంగానికి కేంద్రంగా నిలవనుంది. క్వాంటం వ్యాలీ పూర్తిస్థాయిలో పనిచేయడం మొదలైన తర్వాత, అమరావతిలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈకోసిస్టమ్ ఏర్పడి, వేలాది ఉద్యోగ అవకాశాలు వచ్చేందుకు అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

వీడియో చూడండి..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.