Chandrababu Birthday: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తినివ్వమని కోరిన బాబు

Chandrababu Birthday: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) కొలువున్న దుర్గమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు..

Chandrababu Birthday: దుర్గమ్మను దర్శించుకున్న చంద్రబాబు.. ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తినివ్వమని కోరిన బాబు
Chandarababu Naidu Visits D

Updated on: Apr 20, 2022 | 1:08 PM

Chandrababu Birthday: విజయవాడ (Vijayawada) ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) కొలువున్న దుర్గమ్మను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దర్శించుకున్నారు. నేడు చంద్రబాబు పుట్టినరోజు కావడంతో అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఆలయ ఈవో భ్రమరాంబ, టీడీపీ నాయకులు చంద్రబాబుకి  బాబుకు స్వాగతం పలికారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వెళ్తున్న చంద్రబాబుకు కమలాపురం వైసీపీ ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి ఎదురయ్యారు. దీంతో చంద్రబాబు ను ఎమ్మెల్యే రవీంద్రనాధ్ రెడ్డి పలకరించారు.  చంద్రబాబుకు కరచాలనం చేసి శుభాకాంక్షలు చెప్పారు.

అమ్మవారి దర్శనం అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. తాను తనకు, ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని చెప్పారు. అంతేకాదు.. తనకు ప్రజల పక్షాన పోరాడేందుకు శక్తి సామర్ధ్యాలు ఇవ్వాలని అమ్మవారిని కోరుకున్నానని తెలిపారు. ప్రజల ఇబ్బందులు తొలగించాలని వేడుకున్నానని.. తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.  తనకు తప్పకుండా జయం సాధిస్తాననే నమ్మకం ఉంది. రాజీలేని పోరాటం తో ప్రజలకు అండగా నిలబడతా.. అంటూ చంద్రబాబు చెప్పారు. ఇక నుంచి అభిమానులుకున్న అంచనాల ప్రకారం ముందుకెళ్తానని అన్నారు.

 

మరోవైపు ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ టీడీపీ నేత చంద్రబాబుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబునాయుడికి భగవంతుడు జగన్నాథుడు, వేంకటేశ్వరుడు ఫలవంతమైన జీవితం, మంచి ఆరోగ్యం, ఆనందం ఇవ్వాలని.. ఆయన ప్రజల సేవలో మరెన్నో సంవత్సరాలగడిపేలా దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నట్లు చెప్పారు బిశ్వభూషణ్.

 

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు  చంద్రబాబు నాయుడుకి జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఆయన మంచి ఆరోగ్యంతో దీర్ఘాయుష్షుతో నిండునూరేళ్ళు జీవించాలని కోరుతున్నట్లు చెప్పారు. 

 

Also Read: Covid-19: మళ్లీ వ్యాప్తి చెందుతోన్న కరోనా వైరస్‌.. ఢిల్లీ, ముంబాయిల్లో డేంజర్‌ బెల్స్‌..!