Andhra Pradesh: పోలవరం చుట్టూ ముదురుతున్న రాజకీయం.. టీడీపీ కౌంటర్లు.. వైసీపీ ఎన్‌కౌంటర్..
Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ తీరును తూర్పారబడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తాజాగా గోదావరి ముంపు ప్రాంతాల్లో..
Andhra Pradesh: పోలవరం ప్రాజెక్టు విషయంలో వైసీపీ తీరును తూర్పారబడుతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తాజాగా గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయకలేక వైసీపీ ప్రభుత్వం చేతులెత్తేసిందని విమర్శించారు. పోలవరం ముంపు మండలాల్లో పర్యటించిన ఆయన మాట్లాడిన ప్రతిచోటా ఇదే అంశాన్ని లేవనెత్తారు. 41 మీటర్ల ఎత్తు వరకే నీళ్లను నిలిపి ముంపు బాధితులకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. 45 మీటర్ల వరకు నీళ్లు నిల్వ చేయాల్సిందేనని, అందరికీ సాయం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. చేతకాకపోతే ఎంపీలతో రాజీనామా చేయించాలని సవాల్ చేశారు చంద్రబాబు.
కాగా, చంద్రబాబు కౌంటర్లకు వైసీపీ నేతలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. టీడీపీ హయాంలో ఉన్నప్పుడు హోదా కోసం, పోలవరం కోసం ఎందుకు రాజీనామా చేయలేదని ప్రశ్నించారు సజ్జల రామకృష్ణారెడ్డి. తమకు చెబుతున్న చంద్రబాబు ముందు తన ఎంపీలతో రాజీనామా చేయించాలని ప్రతి సవాల్ విసిరారు మాజీ మంత్రి కొడాలి నాని. ఈ సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య ఎవరు రాజీనామా చేస్తారో తెలియదు కానీ, పోలవరం చుట్టూ రాజకీయం మాత్రం రసవత్తరంగా సాగుతోంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..