టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబును సీఐడీ అధికారులు రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. సిల్క్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో శనివారం అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు హాజరుపరిచి.. రిమాండ్ రిపోర్టును దాఖలు చేశారు. ఆ తర్వాత ఏసీబీ కోర్టు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సుదీర్ఘంగా వాదనలు సాగాయి.
చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా, సీఐడీ తరఫున అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య వాదనలు కొనసాగాయి. ఇరువర్గాల వాదనలు విన్నతర్వాత కోర్టు సీఐడీ వాదనలు పరిగణలోకి తీసుకుంది కోర్టు. దీంతో చంద్రబాబుకు 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్‌ను విధించింది కోర్టు. అనంతరం చంద్రబాబు తరఫు న్యాయవాదులు కోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ సైతం చంద్రబాబును కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్‌లో కోరింది.
దీనిపై కౌంటర్ దాఖలు చేయాలంటూ సీఐడీ కోర్టు ఆదేశించింది. ఆ తర్వాత సీఐడీ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టు నుంచిరాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలిస్తున్నారు. మరో వైపు సెంట్రల్ జైలులో ఓ ప్రత్యేక గదిని సిద్ధం చేసినట్లుగా సమాచారం. రాజమండ్రి జైలు వద్ద భద్రతను సైతం కట్టుదిట్టం చేశారు అధికారులు. ఇదిలా ఉండగా.. విజయవాడలో భారీ వర్షం కురుస్తున్నది. విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వెళ్లేందుకు సుమారు రెండుగంటలకుపైగా సమయం పట్టనున్నది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..