Chandrababu: వివేకాపై వేసిన అపనిందని షర్మిల ఖండించింది.. సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్..

సీఎం జగన్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకాపై అపనింద వేయడాన్ని ఖండిస్తున్నా అని షర్మిల అంటున్నారు దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు.

Chandrababu: వివేకాపై వేసిన అపనిందని షర్మిల ఖండించింది.. సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు డిమాండ్..
Chandrababu Naidu

Edited By:

Updated on: Apr 27, 2023 | 7:08 AM

ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రోడ్‌ షో నిర్వహించారు టీడీపీ అధినేత చంద్రబాబు. పెదమక్కెవ నుంచి సత్తెనపల్లి వరకు రోడ్‌షో నిర్వహించిన బాబు.. సీఎం జగన్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వివేకాపై అపనింద వేయడాన్ని ఖండిస్తున్నా అని షర్మిల అంటున్నారు దీనిపై సీఎం జగన్ సమాధానం చెప్పాలని చంద్రబాబు సవాల్ చేశారు. అంతేకాదు అసలు చరిత్ర మిమ్మల్ని క్షమిస్తుందా.. సలామ్ కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు.  గొడ్డలి పోటుతో బాబాయ్ ని లేపేశాడు. ఆ తప్పును తనపై వేశారని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.

సత్తెనపల్లి రోడ్‌షోలో మంత్రి అంబటిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటికి డయాఫ్రమ్ అంటే తెలియదని విమర్శించారు. ఓనమాలు కూడా తెలియని వ్యక్తికి నోరుంటే సరిపోదంటూ చురకలు అంటించారు. పెదకూరపాడు-అమరావతి రోడ్డు వేయలేని నువ్వు టీడీపీని విమర్శించే మగాడివా అంటూ ప్రశ్నించారు చంద్రబాబు. మంత్రి అంబటి తనను, పవన్‌ను రోజూ విమర్శిస్తుంటారని మండిపడ్డారు. విమర్శలకు భయపడబోనన్న టీడీపీ అధినేత.. మంత్రి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఎక్కువ గౌరవం ఉంటుందన్నారు. కార్మికుడి చనిపోయినా మంత్రి రెండున్నర లక్షల రూపాయల లంచం అడిగారంటూ విమర్శించారు. అంబటి అక్రమ మైనింగ్ చేస్తున్నారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారన్నారు. ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్న మంత్రి తమ్ముడు.. ఇప్పుడు అజ లేకపోవడంలో చిదంబర రహస్యం ఉందన్నారు చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి