Chandrababu Naidu: ఇది ప్రభుత్వ వైఫల్యమే.. రుయా ఘటనపై చంద్రబాబు ఆవేదన.. వీడియో షేర్ చేసి..

|

Apr 26, 2022 | 1:48 PM

Tirupati Ruia Hospital: ఏపీలోని తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన అమానవీయ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ మాఫియా కారణంగా బిడ్డను తండ్రి ద్విచక్రవాహనంపై 90 కి.మీ పాటు

Chandrababu Naidu: ఇది ప్రభుత్వ వైఫల్యమే.. రుయా ఘటనపై చంద్రబాబు ఆవేదన.. వీడియో షేర్ చేసి..
Chandrababu Naidu
Follow us on

Tirupati Ruia Hospital: ఏపీలోని తిరుపతి రుయా ఆసుపత్రిలో జరిగిన అమానవీయ ఘటనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ మాఫియా కారణంగా బిడ్డను తండ్రి ద్విచక్రవాహనంపై 90 కి.మీ పాటు తీసుకెళ్లిన ఘటన మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. కాగా.. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తంచేశారు. బాలుడు జేసవా మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి బైక్ పై తరలించాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యమేనంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొడుకు మృతదేహాన్ని 90 కిలోమీటర్లు బైక్ పై తీసుకువెళ్లిన ఘటన రాష్ట్ర ఆరోగ్యశాఖలో నెలకొన్న దుస్థితి, మౌలిక సదుపాయాల కొరతకు అద్దం పడుతుందంటూ చంద్రబాబు పేర్కొన్నారు. తిరుపతిలోని RUIA ఆసుపత్రిలో మరణించిన చిన్నారి జేసివను చూసి చలించిపోయానని.. అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అతని తండ్రి వేడుకున్నా కనికరించలేదంటూ ట్విట్ చేశారు. ఈ మేరకు బాలుడు మృత దేహాన్ని తండ్రి బైక్ పై తరలిస్తున్న వీడియోను చంద్రబాబు పంచుకున్నారు.

కాగా.. రుయాలో అంబులెన్స్ దందాపై ఆర్డీఓ కనకనరసారెడ్డి వాహనాన్ని బీజేపీ, టీడీపీ, జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు. రూయా సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద నాయకులు ధర్నా నిర్వహించారు. అంబులెన్స్ ఘటనపై సమాధానం చెప్పాలని.. వెంటనే చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. ప్రైవేట్ అంబులెన్స్ మాఫియాను అరికట్టాలంటూ నినాదాలు చేశారు. దీంతో రుయా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

అన్నమయ్య జిల్లా చిట్వేలుకు చెందిన జేసివ అనే బాలుడు కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. దీంతో తల్లిదండ్రులు బాలుడిని రుయా ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతిచెందాడు. దీంతో బాలుడి మృతదేహాన్ని తరలించేందుకు బంధువులు ఉచిత అంబులెన్స్‌‌ను పంపారు. అయితే.. బయటి అంబులెన్స్‌లు రుయా ఆసుపత్రిలోకి వచ్చే ప్రసక్తే లేదని.. తమ వాహనంలోనే మృతదేహాన్ని తీసుకెళ్లాలంటూ రుయా అంబులెన్స్‌ డ్రైవర్లు అడ్డుకున్నారు. ఎంత చెప్పినా వినకుండా.. కనీస కనికరం లేకుండా నిర్వాహకులు బాలుడి తల్లిదండ్రులతో గొడవకు దిగారు. దీంతో చేసేదేం లేక తండ్రి కుమారుడి మృతదేహాన్ని 90 కి.మీ స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. ఈ అమానవీయ ఘటనపై అందరూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Also Read:

Elon Musk: ఎలాన్ మస్క్ డబుల్ ధమాకా! ఒకే రోజు ఆకాశం.. భూమి రెండిటిపై సంచలన విజయాలు..

Tirupati: అయ్యయ్యో.. రుయా..! కుమారుడి మృతదేహాన్ని బైక్‌పై 90 కి.మి తీసుకెళ్లిన తండ్రి