AP Inter hall tickets 2022: ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ హాల్ టిక్కెట్లు 2022 విడుదల..
ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది పరీక్షల హాల్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) విడుదల చేసింది..
AP Inter hall ticket 2022 Download: ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది పరీక్షల హాల్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (BIEAP) విడుదల చేసింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు సంబంధించిన కాలేజీల లాగిన్ ద్వారా అధికారిక వెబ్‌సైట్ jnanabhumi.ap.gov.in నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అంటే విద్యార్థులు నేరుగా వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేయలేరన్నమాట. ఈ మేరకు కాలేజీల ప్రిన్సిపల్లందరూ (College Prinicipals) హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసి విద్యార్ధులకు జారీ చేయాలని బోర్డు అధికారిక నోటిఫికేషన్‌లో పేర్కొంది. హాల్ టికెట్ల జారీలో ఏదైన సమస్యలు తలెత్తితే తీవ్రంగా పరిగణించాలని.. విద్యార్ధుల పేర్లు, మీడియం, సబ్జెక్టులు వంటి ఇతర వివరాలను.. క్షుణ్ణంగా పరిశీలించాలని, ఏవైనా అవకతవకలు తలెత్తితే సంబంధిత ఆర్‌ఐఓ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది.
కాగా ఏపీ ఇంటర్ ప్రథమ సంవత్సరం థియరీ పరీక్షలు మే 6 నుంచి 23 వరకు జరగనున్నాయి. సెకండియర్ పరీక్షలు మే 7 నుంచి 24 వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఇంటర్ బోర్డు హాల్‌టిక్కెట్లను జారీ చేసింది.
Also Read: