Chandrababu: హస్తిన టీడీపీ అధినేత చంద్రబాబు బృందం ఫిర్యాదులు, విన్నపాలు, వినతుల పరంపర

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి ఫిర్యాదు చేశారు.

Chandrababu: హస్తిన టీడీపీ అధినేత చంద్రబాబు బృందం ఫిర్యాదులు, విన్నపాలు, వినతుల పరంపర
Chandrababu meets President Ram Nath Konvind

Updated on: Oct 25, 2021 | 9:00 PM

President Ramnath Kovind – Chandrababu: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం పేట్రేగుతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌కి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సర్కారు రాష్ట్రంలో ప్రాయోజిత ఉగ్రవాదానికి పాల్పడుతోందని చంద్రబాబు నేతృత్వంలోని 7 గురు సభ్యుల టీడీపీ బృందం రాష్ట్రపతికి విన్నవించింది. ఇవాళ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన చంద్రబాబు బృందం ఈ మేరకు ఫిర్యాదు చేసింది.

ఏపీలో రాష్ట్రపతి పాలనతోపాటు డీజిపీని రీకాల్‌ చేయాలని తెలుగుదేశం బృందం రాష్ట్రపతిని కోరింది. అనంతరం సమావేశ వివరాలను మీడియాకు చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తమ విజ్ఞప్తికి రాష్ట్రపతి సానుకూలంగా స్పందించినట్లు బాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలని.. రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్‌ను కోరామని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించటంతో పాటు.. ఎక్కడ గంజాయి పట్టుకున్నా ఏపీ చిరునామాగా మారిందని చంద్రబాబు రాష్ట్రపతి ద‌ృష్టికి తీసుకెళ్లారు.

ఏపీలోని ఏజెన్సీలలో దాదాపు 25 వేల ఎకరాల్లో గంజాయి పెంచుతున్నారని, మద్యపాన నిషేధమని చెప్పి ధరలు పెంచి సొంత వ్యాపారం చేస్తున్నారని టీడీపీ నేతలు రాష్ట్రపతికి తెలిపారు.

రాష్ట్రంలో మద్యం ప్రత్యేక బ్రాండ్లను సీఎం జగన్‌ ప్రవేశపెట్టారని తెలిపారు. మాదకద్రవ్యాల వల్ల యువత నిర్వీర్యమైపోయే పరిస్థితి ఏర్పడిందని.. మాదకద్రవ్యాలను అదుపుచేయాలని ప్రభుత్వాన్ని కోరితే, ఒకేసారి టీడీపీ కార్యాలయాలపై దాడులు చేశారని తెలుగుదేశం పార్టీ నేతలు రాష్ట్రపతికి తెలిపారు. ఈ వ్యవహారాలపై తగిన చర్యలు తీసుకోవాలని బృందం రాష్ట్రపతిని కోరింది.

Read also: AP Elections: ఏపీలో మరోపోరు.. జనవరిలోగా ఆంధ్రప్రదేశ్‌లో సహకార ఎన్నికలు!