Chandrababu Naiud: టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు.. అద్భుతంగా పని చేస్తున్నారని చంద్రబాబు కితాబు

|

Sep 16, 2022 | 6:39 AM

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫార్మ్ చేశారు. టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు..

Chandrababu Naiud: టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ మళ్లీ టిక్కెట్లు.. అద్భుతంగా పని చేస్తున్నారని చంద్రబాబు కితాబు
Chandrababu Naidu
Follow us on

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో టిక్కెట్లు కన్ఫార్మ్ చేశారు. టీడీఎల్పీ సమావేశంలో చంద్రబాబు వివరాలు ప్రకటించారు. పార్టీ కోసం ఎమ్మెల్యేలందరూ బాగా కష్టపడుతున్నారని, వచ్చే ఎన్నికల కోసం పనిచేసుకోవాలని చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. టీడీపీ మాదిరిగా వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలకు టికెట్లు ఇచ్చే ధైర్యం సీఎం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. స్వార్థ రాజకీయాల కోసం సీఎం జగన్‌ (CM Jagan) ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అమరావతి (Amaravati) పై మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలకు సంపద సృష్టి కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దీనిని చూసి జగన్ తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో కొందరు పార్టీ టికెట్ రాదేమోనని, మరికొందరు టికెట్ వచ్చినా గెలవలేమన్న ఆందోళనలో ఉన్నారు. కానీ టీడీపీ ఎమ్మెల్యేలకు ఆ భయం లేదని, ప్రజా సమస్యలపై వారు చేస్తున్న పోరాటమే మళ్లీ వారిని గెలిపిస్తుంది. అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్‌ సహా అందరి ఆమోదంతోనే రాజధానిగా అమరావతిని ఖరారు చేశాం.

– చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి

ఇవి కూడా చదవండి

కాగా.. గురువారం నుంచి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తొలిరోజు వాడీవేడీగా సాగింది. తెలుగుదేశం పార్టీతో పాటు, చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. టీడీపీ ఏ అంశాన్ని లేవనెత్తినా సభలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, మీ నాయకుడిని సభకు రమ్మనండి దేనికైనా రెడీ అంటూ వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలపై చర్చించడానికి తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. సభ సజావుగా జరిగేలా ప్రతిపక్ష సభ్యులు సహకరించాలి, సభకు వచ్చి గౌరవంగా ఉండాలని సీఏం జగన్మోహన్ రెడ్డి టీడీపీ సభ్యులకు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..