Chandrababu Delhi Tour: ఏపీలో రాజకీయాలు భగ్గుమంటున్నాయి. రోజురోజుకు ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఇటీవల తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపై జరిగినే దాడి నేపథ్యంలో చంద్రబాబు ఈ రోజు ఢిల్లీకి పయనం కానున్నారు. అక్కడ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలువనున్నారు. అయితే టీడీపీ నేతల బృందానికి సోమవారం 12.30 రాష్ట్రపతి భవన్ సమయం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పర్యటనలో 18 మంది టీడీపీ నేతలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై వివరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రంలో ఆర్టికల్ 356 అమలు చేయాలని కోరనున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇతర ముఖ్యనేతలతను కూడా కలువనున్నారు. ప్రస్తుత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితులపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్నారు చంద్రబాబు. అయితే ఢిల్లీ పర్యటన అజెండాపై చంద్రబాబు.. శనివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన చంద్రబాబు.. పలు విషయాలపై చర్చించారు. ఢిల్లీ పర్యనటలో ఎలాంటి విషయాలు మాట్లాడాలనే దానిపై నేతలతో చర్చించారు. తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ ఇటువంటి భౌతిక దాడులకు దిగలేదని, అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుని సిద్ధాంతం ప్రకారం ఓటర్లకు వెళ్దామని నేతలకు సూచించారు.
టీడీపీ కార్యాలయాలపై దాడులు, డ్రగ్స్ వ్యవహారం, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కేంద్ర పెద్దలకు ఫిర్యాదు చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి, ప్రధాని, అమిత్ షా, గవర్నర్‌కు లేఖలు రాశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఫెయిలైందని.. రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేస్తోంది టీడీపీ. అలాగే టీడీపీ ఆఫీస్‌పై దాడిని ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరుతోంది. రాష్ట్రపతికి కూడా ఇవే అంశాలపై ఫిర్యాదు చేయానున్నారు. రెండు రోజుల పాటు హస్తినలోనే మకాం వేయనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా అపాయింట్ మెంట్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. వీలైతే మరి కొందరు కేంద్ర పెద్దలను కలవాలని భావిస్తున్నారు.