సృష్టిలో ప్రతి జీవికి తనదైన ప్రత్యేకత ఉంటుంది. విశ్వాసం ప్రదర్శించటం మాత్రమే కాదు.. వాసనతో వేటను పసిగట్టడం కూడా కుక్కల ప్రత్యేకత. అందుకే కుక్కలను ఇప్పటికీ మనిషి తన భద్రత కోసం వీటిని పెంచుకుంటూ ఉంటాడు. ఇక పరిసలకు అనుగుణంగా తమని తాము మలచుకునే జీవులుకూడా అనేకం ఉన్నాయి. అమీబా తన ఆక్రృతిని తానే మార్చుకున్నట్లే.. ఊసరవెల్లి కూడా ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఊసరవెల్లి దీని ప్రధాన లక్షణం రంగులు మార్చటం.
సంతోషం, దుఃఖం, విచారం, బాధ, కోపం ఇలా మనిషి తనకు కలిగిన లేదా అనుభూతికి అనుగుణంగా అతడి ముఖంలో ఫీలింగ్స్ మారిపోతాయి. ముఖ కవలికలను బట్టి అతడి అంతర్ముఖాన్ని చెప్పేయొచ్చు. అదే విధంగా వాతావరణానికి అనుగుణంగా తన శరీర రంగును మార్చుకోగల జీవి ఈ ఊసరవెల్లి. ఇది తన పరిసరాల్లో ఏది ఎక్కువగా ఉంటే ఆ రంగు కలిగి ఉంటుంది.
కొయ్యలగూడెం మండలం కన్నాపురంలో ఊసరవెల్లి కనిపించింది. దీంతో స్ధానికులు ఆశ్చర్యంగా దీన్ని చూశారు. అంతరించిపోతున్న జీవుల్లో ఇది కూడా ఉండటంతో ఇవి చాలా అరుదుగా మాత్రమే ప్రస్తుతం కనిపిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు. వాతావరణంలో ఉష్ణోగ్రత లతో పాటు దీనికి కోపం వచ్చినా, భయం వేసినా తన రంగును మార్చేసుకుంటుందట. వాతావరణం కూల్ గా ఉంటే ముదురు రంగులోనూ, వేడిగా ఉన్నపుడు గ్రీన్ కలర్, భయం – టెన్షన్ లో ఉంటే ఎరుపు, మెరూన్ కలర్లోకి మారిపోతుందట. ఊసరవెల్లి ఒకే సారి తన రెండు కళ్లను వేరు వేరు దిశల్లో కి మార్చి పరిసరాలను చూడగలుగుతుందట. దాని చర్మం లో ఇరుడో పోరస్ కణాల ప్రభావంతోనే అది రంగులు మార్చగలుగుతుంటారు. ఇక మాటలు మార్చే వ్యక్తి ని , ఏ ఎండకు ఆ గొడుగు అన్నట్టు తరుచుగా పార్టీ మార్చే మనిషిని ఊసరవెల్లి తో పోలుస్తుంటారు. అయితే ఊసరవెల్లి తన ప్రాణం కాపాడుకోవటానికి, శత్రువులకు దొరక్కుండా తనకు తాను రక్షించుకోవడానికి ఇలా చేస్తుంది. కాని కొందరు స్వార్ధపరులు మాత్రం స్వలాభం కోసం ఊసరవెళ్లిలా తమ నైజం మార్చుకుంటారని ఉదహరిస్తూ ఉంటారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..