Gold Man: శ్రీవారి సన్నిధిలో బంగారు బాబు.. ఫోటోలు తీసుకునేందుకు ఎగబడ్డ భక్తులు..
కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండ విజయ్ కుమార్. ఈ పేరు చెబితే అంతగా గుర్తుకురాకపోవచ్చు. అదే గోల్డ్ మెన్ గా అందరికీ సుపరిచితులే. మార్చి 15, శుక్రవారం తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు ఈ బంగారు బాబు. దాదాపు పది కిలోల బరువున్న స్వర్ణాభరణాలు ఒంటిపై ధరించి శ్రీవారి సేవలో తరించారు. దర్శనానంతరం ఆలయం బయటకు వచ్చిన ఈ గోల్డ్ మెన్ ను చూసిన భక్తులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు.

కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు హోప్ ఫౌండేషన్ ఛైర్మన్ కొండ విజయ్ కుమార్. ఈ పేరు చెబితే అంతగా గుర్తుకురాకపోవచ్చు. అదే గోల్డ్ మెన్ గా అందరికీ సుపరిచితులే. మార్చి 15, శుక్రవారం తిరుమలలో శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనంలో స్వామిని దర్శించుకున్నారు ఈ బంగారు బాబు. దాదాపు పది కిలోల బరువున్న స్వర్ణాభరణాలు ఒంటిపై ధరించి శ్రీవారి సేవలో తరించారు. దర్శనానంతరం ఆలయం బయటకు వచ్చిన ఈ గోల్డ్ మెన్ ను చూసిన భక్తులు ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ఎగబడ్డారు. నిలువెత్తు దేహం బంగారు ఆభరణాలతో దగదగమని మెరిసిపోతున్న కొండ విజయ్ కుమార్ ను చూసి ఆశ్చర్యానికి గురైయ్యారు అక్కడి భక్తులు.
మెడలో వివిధ డిజైన్లతో కూడిన చాంతాడంత చైన్లు, అతిపెద్ద లాకెట్, చేతికి కడియాలు, పదివేళ్లకు పది బంగారు ఉంగరాలు, చేతి గడియారాన్ని ధరించారు. ఇంతటి ఆడంబరంగా కనిపించడానికి కారణం స్వామి అనుగ్రహమే అని చెబుతున్నారు ఈ బంగారు బాబు. తమ హోప్ ఫౌండేషన్ ద్వారా నిత్యం వందల మంది భక్తులకు దర్శన భాగ్యం కలిపిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో వేల మందికి దర్శనం కల్పంచేలా శక్తిని ఇవ్వాలని స్వామిని వేడుకున్నట్లు చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా నిత్యం వేల మందికి అన్నదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది సేవా కార్యక్రమాలు మొత్తం తన వ్యక్తిగత ధనార్జనేనని ఎవరి వద్ద నుంచి విరాళాలు వసూలు చేయడం లేదన్నారు. ఇంతటి గొప్ప అవకాశం వేంకటేశ్వరుడు నాకు కల్పించడం నా అదృష్టం అని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. గత రెండేళ్లుగా స్వామి వారి సేవలో పాత్రులు అవుతున్నట్లు చెప్పారు. ఈయనతో పాటు ఫౌండేషన్ కు చెందిన పలువురు సభ్యులు హాజరయ్యారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…








