NTR Coin: ఇవాళ ఎన్టీఆర్‌ రూ.100 నాణెం విడుదల.. ఎన్నో ప్రత్యేకతలు.. రాష్ట్రపతికి లక్ష్మీ పార్వతి ఫిర్యాదు.. కారణం ఇదే..

|

Aug 28, 2023 | 8:44 AM

ఎన్టీఆర్ పేరిట వందరూపాయల నాణెం విడుదల కానుంది. సోమవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా ఈ నాణెం విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా నందమూరి కుటుంబం సభ్యులు హాజర్వుతారు.  నాణెం ఆవిష్కరించిన తర్వాత ఎన్టీఆర్‌ జీవిత విశేషాలపై 20నిమిషాల వీడియోను ప్లే చేస్తారు. ఎన్టీఆర్‌ నాణానికి చాలా ప్రత్యేకతలున్నాయి.

NTR Coin: ఇవాళ ఎన్టీఆర్‌ రూ.100 నాణెం విడుదల.. ఎన్నో ప్రత్యేకతలు.. రాష్ట్రపతికి లక్ష్మీ పార్వతి ఫిర్యాదు.. కారణం ఇదే..
Ntr Coin
Follow us on

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుకి జాతీయ గుర్తింపు దక్కుతోంది. ఎన్టీఆర్ పేరిట వందరూపాయల నాణెం విడుదల కానుంది. సోమవారం ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతులు మీదుగా ఈ నాణెం విడుదల చేస్తారు. ఈ కార్యక్రమానికి బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా నందమూరి కుటుంబం సభ్యులు హాజర్వుతారు.  నాణెం ఆవిష్కరించిన తర్వాత ఎన్టీఆర్‌ జీవిత విశేషాలపై 20నిమిషాల వీడియోను ప్లే చేస్తారు. ఎన్టీఆర్‌ నాణానికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఈ నాణెం తయారీకి నాలుగు లోహాలను వినియోగించారు. నాణెం చుట్టుకొలత 44 మిల్లీమీటర్లు ఉంటుంది. నాణెం తయారీలో 50శాతం వెండి, 40శాతం రాగి, 5శాతం నికెల్‌, 5శాతం జింక్‌ వినియోగించారు.

నాణెం ఎలా ఉంటుంది?..

ఎన్టీఆర్‌ నాణెం ఎలా ఉండబోతోంది అనేది ఆసక్తి రేపుతోంది. ఇప్పటికే అనేక ఫొటోలు వైరల్‌ అవుతున్నా.. ఫుల్ క్లారిటీ మాత్రం విడుదల తర్వాత వస్తుంది. అయితే, ఎన్టీఆర్‌ నాణెంలో ఒకవైపు మూడు సింహాలు, అశోక చక్రం ఉండనున్నట్టు తెలుస్తోంది. రెండోవైపు ఎన్టీఆర్‌ చిత్రంతోపాటు వందేళ్లను సూచిస్తూ 1923 – 2023 ఉండబోతోంది.

ఎవరెవరికి ఆహ్వానం..

ఎన్టీఆర్‌ నాణెం విడుదల కార్యక్రమం ఆహ్వానితుల జాబితాపైనా వివాదం చెలరేగింది. అసలు, ఎవరెవరికి అధికారికంగా ఆహ్వానాలు పంపారో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు ఆహ్వానాలు అందాయి. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, చంద్రబాబు, భువనేశ్వరి దంపతులతోపాటు.. పురంధేశ్వరి – వెంకటేశ్వరరావు దంపతులు, లోకేష్‌, కల్యాణ్‌రామ్‌, టీడీపీ ఎంపీలు, నేతలు, టాలీవుడ్‌ నిర్మాతలకు ఆహ్వానాలు వచ్చాయి.

టీడీపీ ఎంపీలు, అలాగే ఆ పార్టీ సీనియర్లు అయ్యన్న పాత్రుడు, బుచ్చయ్య చౌదరి, ఎన్టీఆర్‌ కుమారులు, కుమార్తెలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొంటారు. వీళ్లతోపాటు ప్రముఖ సినీ నిర్మాతలు అశ్వినీదత్‌, దగ్గుబాటి సురేశ్‌బాబు కూడా పాల్గోనున్నారు.

అతిథులు జాబితాలో లక్ష్మీపార్వతి పేరు..

ఈ కార్యక్రమానికి… నారా, నందమూరి, దగ్గుబాటి కుటుంబాలను కేంద్రం ఆహ్వనించింది. అయితే,  ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతిని పిలవలేదు. అందరికీ ఆహ్వానాలు పంపిన కేంద్రం తనను పట్టించుకోలేదన్నారు లక్ష్మీ పార్వతి. ఎన్టీఆర్  నాణెం విడుదల ఉత్సవానికి అతిథులు జాబితాలో లక్ష్మీపార్వతి పేరు కనిపించలేదు. దీంతో ఆమె రాష్ట్రపతికి లేఖ రాశారు ఆహ్వానితుల లిస్టులో తన పేరును చేర్చకుండా చంద్రబాబుతోపాటు ఇతర కుటుంబ సభ్యులను ఆహ్వానించడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ భార్యనైన తనను ఆహ్వానించకుండా ఉండటం సరికాదని.. వెంటనే రాష్ట్రపతి జోక్యం చేసుకోవాలని లేఖలో పేర్కొన్నారు. 1994 ఎన్నికల్లో తాను ఎన్టీఆర్‌తో ఉన్నట్లు చెప్పారు. ఎన్టీఆర్‌తో వివాహం, ఎన్నికల్లో గెలుపు, ఆ తర్వాత జరిగిన పరిణామాలు తదితర అంశాలతో ఆమె ఈ లేఖ రాశారు.

హైదరాబాద్ మింట్ కాంపౌండ్ నుంచి..

ఈ నాణాన్ని హైదరాబాదులోని మింట్ కాంపౌండ్‌లోనే ముద్రించబడటం విశేషం. అయితే 100 రూపాయల నాణెం మీద ముద్రించిన ఎన్టీఆర్ బొమ్మలను ఆయన కుటుంబ సభ్యులకే స్వయంగా సెలెక్ట్ చేసుకునే అవకాశం కల్పించారట. ఎన్టీఆర్ రూపంతో ఈ 100 రూపాయల నాణెం ముద్రించడం పట్ల నందమూరి అభిమానుల సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం