ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించేందుకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. వాస్తవానికి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి.. ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‌గా స్టీఫెన్ రవీంద్రను నియమించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ అప్పట్లో కేంద్రం ఈ అంశాన్ని పెండింగ్‌లో పెట్టింది. తాజాగా జగన్ ఢిల్లీ టూర్ ముగిసిన రెండు రోజులకే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. చర్చనీయాంశంగా మారింది.
కాగా, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఛీప్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా స్టీఫెన్ రవీంద్ర పనిచేశారు. అంతేకాదు రాయలసీమలో కూడా బాధ్యతలు నిర్వర్తించారు. 1990 బ్యాచ్‌కు చెందిన ఈయన.. సర్దార్ వల్లభాయ్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ పూర్తి చేసుకున్నారు.