AP High Court: “హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా?”.. జీవీఎల్‌ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం..

ఏపీ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది కేంద్రం స్పష్టం చేసింది.  తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని తెలిపింది.

AP High Court: హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా?.. జీవీఎల్‌ ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం..
Follow us

|

Updated on: Feb 04, 2021 | 12:44 PM

AP High Court: ఏపీ హైకోర్టు తరలింపు నిర్ణయం ప్రస్తుతం హైకోర్టు పరిధిలో ఉంది కేంద్రం స్పష్టం చేసింది.  తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయమని తెలిపింది. తరలింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాలని సూచించింది. హైకోర్టు నిర్వహణ ఖర్చు బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని కేంద్రం పేర్కొంది. హైకోర్టు పరిపాలన బాధ్యతలు ప్రధాన న్యాయమూర్తి పరిధిలో ఉంటాయని వివరించింది.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గతేడాది ఫిబ్రవరిలో హైకోర్టు ప్రధాన బెంచ్‌ను కర్నూలుకు తరలించాలని ప్రతిపాదన పంపారని తెలిపింది. హైకోర్టు తరలింపునకు ఎలాంటి గడువూ లేదని కేంద్రం తేల్చి చెప్పింది. హైకోర్టును కర్నూలుకు తరలిస్తున్నారా? అని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

Also Read:

Chicken Price Down: ఢమాల్.. ఢమాల్.. మరింత పడిపోయిన చికెన్ ధరలు.. కేజీ రేటు ఎంతో తెలుసా..?

Chris Gayle: సప్త సముద్రాలు ఈదినవాడికి పిల్లకాలవే ఎదురొస్తే..? క్రిస్ గేల్ విధ్వంసకర ఇన్నింగ్స్…

IRCTC offer: ఐఆర్‌సీటీసీ బంఫర్ ఆఫర్.. అదిరే క్యాష్‌బ్యాక్.. కొన్ని రోజులు మాత్రమే.. పూర్తి వివరాలు ఇవి