AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైజాగ్‌ను పేర్కొంటూ కేంద్రం డాక్యుమెంట్.. ఏపీ రాజకీయాల్లో కొత్త అలజడి

|

Aug 29, 2021 | 4:58 PM

జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ తెరపైకి తెచ్చింది. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి

AP Capital: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైజాగ్‌ను పేర్కొంటూ కేంద్రం డాక్యుమెంట్.. ఏపీ రాజకీయాల్లో కొత్త అలజడి
Visakha
Follow us on

Visakhapatnam: జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. మూడు రాజధానుల కాన్సెప్ట్‌ తెరపైకి తెచ్చింది. అధికార వికేంద్రీకరణతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నది ప్రభుత్వ ఆలోచన. ఈ దిశగా అడుగులు కూడా పడ్డాయి. అయితే.. న్యాయపరమైన చిక్కులు ఎదురవడంతో.. వాటిని క్లియర్‌ చేసుకునే పని కొనసాగుతోంది. ఆరునూరైనా, ఎగ్జిక్యూటివ్ కేపిటల్‌ విశాఖపట్నానికి తీసుకెళ్తామంటూ తరచూ చెప్తున్నారు పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ అంశంపై పోరుబాటపట్టిన తెలుగుదేశం పార్టీ వివిధ దశల్లో వ్యతిరేకతను వ్యక్తం చేస్తోంది.

అయితే, ఏపీ రాజధాని అంశానికి సంబంధించి తాజాగా కొత్త అలజడి రేగింది. ఆయా రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలాగున్నాయంటూ పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల అడిగిన ప్రశ్నకు కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ రాతపూర్వక వివరణ ఇచ్చింది. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వశాఖ ఇచ్చిన వివరణలో ఏపీ రాజధానిగా వైజాగ్ ను పేర్కొంది. కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ పేరుతో విడుదలైన ఈ డాక్యుమెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ కేపిటిల్ గా వైజాగ్ ను చూపడంతో కేంద్రం అధికారికంగా గుర్తించిందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వైజాగ్ ను చూపెడుతూ కేంద్ర పెట్రోలియం అండ్ గ్యాస్ మంత్రిత్వశాఖ విడుదల చేసిన డాక్యుమెంట్ పై వైసీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే గుడివాడ అమర్ నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాజధాని వైజాగేనన్న దానిపై మాకు గాని, మా ప్రభుత్వానికి గాని, ప్రజలకు గాని ఎలాంటి అనుమానం లేదంటూ సంచలన కామెంట్స్ చేశారు. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు.

Gudivada Amarnath Reddy

Read also: Harish Rao: అంగన్‌వాడీ స్కూల్స్ పై తెలంగాణ సర్కారు త్వరలో కీలక నిర్ణయం