AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: పక్కింట్లో అర్ధరాత్రి ఏవో చప్పుళ్లు.. ఏంటని చూడగా కనిపించిన రెండు ఆకారాలు.. చివరికి.!

కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగతనానికి వచ్చి కారుతో పాటు దొంగలు ఉడాయించారు. కుక్కకు మత్తు మందు ఇచ్చి దుండగులు ఇంట్లోకి ప్రవేశించి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి మరి. ఇదిగో ఇది.

Andhra: పక్కింట్లో అర్ధరాత్రి ఏవో చప్పుళ్లు.. ఏంటని చూడగా కనిపించిన రెండు ఆకారాలు.. చివరికి.!
Representative Image
Pvv Satyanarayana
| Edited By: Ravi Kiran|

Updated on: Nov 30, 2025 | 1:38 PM

Share

కాకినాడ జిల్లా కాజులూరు మండలం గొల్లపాలెంలో దొంగలు వినూత్నంగా చోరీకి పాల్పడ్డారు. తాళం వేసి ఉన్న ఇంట్లో పెంపుడు కుక్క ఉందని గ్రహించి దానికి మత్తు మందు కలిపిన బిస్కెట్లు వేసి అది స్పృహ కోల్పోయిన తర్వాత ఇంట్లో ప్రవేశించారు దుండగులు. ఇంటిలోని ల్యాప్‌టాప్, ఆవరణలో నిలిపిన కారుతో పాటు ఉడాయించారు. ఆ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఎస్సై మోహన్ కుమార్, స్థానికుల వివరాల ప్రకారం.. గొల్లపాలెం గ్రామానికి చెందిన నేతి భగవాన్ ఇంటికి మరమ్మతులు చేయించే క్రమంలో పక్క ఇంట్లో ఉంటున్నారు. అర్ధరాత్రి పన్నెండు గంటల తరవాత ఆ ఇంట్లో చోరీకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు పెంపుడు శునకాన్ని చూసి దానికి మత్తు మందు కలిపిన బిస్కెట్లు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. శునకం మత్తులోకి జారుకున్న తర్వాత గేటు తాళాలు పగలగొట్టి లోనికి చొరబడి ఉంటారని అనుమానిస్తున్నారు పోలీసులు.

ఇంటి తాళాలు తెరిచి చూడగా విలువైన వస్తువులేవీ కనిపించలేదు. దీంతో ల్యాప్‌టాప్‌ను అందుకుని ఆవరణలోని హ్యుందాయ్ వెన్యూ కారుతో ఉడాయించారు. తెల్లవారుజామున చోరీ జరిగినట్లు గ్రహించిన భగవాన్ పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ సీఐ పి. శ్రీనివాస్, ఎస్సై ఎం.మోహన్ కుమార్ సిబ్బందితో కలిసి ఆధారాలు సేకరించారు. పెంపుడు శునకాన్ని పశు వైద్యులు పరీక్షించారు. ఎస్సై మోహన్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
రేపట్నుంచే TSLPRB APP రాత పరీక్షల అడ్మిట్‌ కార్డులు.. లింక్ ఇదే
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
ఆర్బీఐ కీలక ప్రకటన.. ఈఎంఐలు కట్టేవారికి శుభవార్త
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
పుతిన్ పర్యటన వేళ ప్రధాని మోదీ పాత చిత్రం వైరల్!
"నీ బుర్ర వాడకు, నేను చెప్పింది చేయి..": కేఎల్ రాహుల్ ఫైర్
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
ఇండస్ట్రీని షేక్ చేసిన హీరోయిన్.. ఇప్పుడు ఊహించని రీతిలో..
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
తెలంగాణలో వచ్చే జూన్‌ నాటికి లక్ష ఉద్యోగాలు.. నిరుద్యోగులకు పండగే
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
నెంబర్ టైప్ చేస్తే చాలు ..మీ లైవ్ లొకేషన్ వస్తుంది.. డేంజర్..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
జైలులో స్నేహం.. మాంచి ప్లాన్‌తో బయటకు వచ్చారు.. కట్ చేస్తే..
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
అమ్మకానికి ప్రభుత్వ బ్యాంకు..! రూ.64 వేల కోట్ల టార్గెట్‌!
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..