Andhra Pradesh: ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది? పోత్తులపై సోము కీలక కామెంట్..

|

Apr 09, 2023 | 8:06 AM

ఏపీలో కాషాయంలో కదిలిక ఉండబోతుందా? కేంద్రమంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు మంతనాలు దేనికి సంకేతం? సోము ఢిల్లీ టూర్ తో ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తుందా? తెలియాలంటే స్టోరీ చూడాలి.

Andhra Pradesh: ఏపీ బీజేపీలో ఏం జరగబోతోంది? పోత్తులపై సోము కీలక కామెంట్..
Ap Bjp
Follow us on

ఏపీలో కాషాయంలో కదిలిక ఉండబోతుందా? కేంద్రమంత్రులతో కిరణ్ కుమార్ రెడ్డి, సోము వీర్రాజు మంతనాలు దేనికి సంకేతం? సోము ఢిల్లీ టూర్ తో ఏపీలో పొత్తులపై క్లారిటీ వస్తుందా? తెలియాలంటే స్టోరీ చూడాలి.

ఏపీ రాజకీయాల్లో సంచలనం జరగబోతుందా? అనే సందిగ్ధం నెలకొంది. మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరిన కొన్ని గంటల నుంచే ఏపీ రాజకీయాల్లో ఇంట్రస్ట్రింగ్ క్రియేట్ చేశారు. ఢిల్లీలో బీజేపీ పెద్దలతో వరుసగా భేటీ అయ్యారు. పార్టీలో చేరిన వన్ డే లోనే అగ్రనేతల అపాయింట్‌మెంట్స్‌ దొరకడంపై.. ఆంధ్రా కాషాయదళంలో కలకలం సృష్టిస్తుంది. ఒకేరోజు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మరో అగ్రనేత బీఎల్‌ సంతోష్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు లేకుండా కలవడం రాష్ట్రంలో హాట్‌ టాపిక్‌గా మారింది. పార్టీలో చేరి రెండు రోజులైనా కాకుండానే, ఏంటీ ప్రయారిటీ అనే గుసగుసలు మొదలయ్యాయి.

అటు ఢిల్లీలో నల్లారి మంతనాలు జరుగుతుండగానే, ఇటు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు ఢిల్లీ నుంచి పిలుపు రావడం ఆగమేఘల మీద హస్తినలో అడుగుపెట్టడం ఒక్కసారిగా ఏపీ బీజేపీలో ఏం జరుగుతుందోనన్న చర్చ మొదలైంది. అయితే, అమిత్‌షా, నడ్డా, బీఎల్‌ సంతోష్‌తో జరిగిన భేటీల్లో నల్లారితోపాటు సోము కూడా అటెండ్‌ కావాల్సి ఉంది.. కానీ, సోము లేకుండానే పార్టీ పెద్దలందర్నీ కలిశారు కిరణ్‌కుమార్‌రెడ్డి. నల్లారితోపాటు ఏపీ నుంచి ఆపార్టీ నేత విష్ణువర్ధన్‌రెడ్డి మాత్రమే ఉన్నారు. ఇదే ఇప్పుడు ఏపీ కమలదళంలో ఆసక్తి రేపుతోంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే హస్తినకు వెళ్లిన వెంటనే కిరణ్ కుమార్ రెడ్డితో సోము వీర్రాజు భేటీ కావడం.. ఆ ఇద్దరు బీఎల్ సంతోష్ తో కలిసి కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, కిషన్ రెడ్డిలతో భేటీ కావడం మంతనాలు జరపడం.. డిన్నర్ చేయడం ఇంట్రస్ట్రింగ్ గా మారింది. అంతటితో కాకుండా హస్తిన వేదికగా పొత్తులపై సోము వీర్రాజు ఆసక్తికర కామెంట్స్ ఆసక్తి రేపుతుంది. పొత్తు విషయంపై తమకు క్లారిటీ ఉంది.. ఏం జరగాలో అదే జరుగుతుందన్నారు సోము. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని పవన్‌ చెప్పారు. తాము కూడా వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలపైనే పోరాడుతున్నామన్నారు సోము.

అయితే మొన్న పవన్ టూర్ తర్వాత వెనువెంటనే కిరణ్ కుమార్ రెడ్డి పార్టీలో చేరడం సోము వీర్రాజుతో కలిసి కేంద్రమంత్రులతో మంతనాలు జరపడం, మరోవైపు ఢిల్లీ వేదికగా పోత్తులపై సోము వీర్రాజు కామెంట్స్ చూస్తుంటే పొలిటికల్ గా ఏదో జరుగుతుందనే చర్చ జరుగుతుంది. వీరి మంతనాల తర్వాత పోత్తులతపై కార్లీరీ వస్తుందా? లేక కిరణ్‌కుమార్‌రెడ్డికి ఏదైనా కీలక పదవి దక్కబోతోందా? లేదా ఏపీ బీజేపీలో మార్పులు ఏమైనా ఉంటాయా? అనే ప్రచారం జరుగుతోంది. ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే వెయిట్ అండ్ సీ అంటున్నారు నేతలు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..