Atmakur Bypoll: ఆత్మకూరులో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్‌.. అక్కడ ప్రత్యేక భద్రత

|

Jun 23, 2022 | 7:44 AM

Atmakur Bypoll: మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోగా..

Atmakur Bypoll: ఆత్మకూరులో ప్రారంభమైన ఉప ఎన్నిక పోలింగ్‌.. అక్కడ ప్రత్యేక భద్రత
Follow us on

Atmakur Bypoll: మాజీ మంత్రి గౌతమ్‌ రెడ్డి ఆకస్మిక మరణంతో ఆత్మకూరులో ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో గురువారం పోలింగ్‌ ప్రారంభమైంది. ఇక్కడ టీడీపీ పోటీ చేయకపోగా, వైసీపీకి ప్రధానంగా టీడీపీ పోటీ ఉంది. ఆత్మకూరులో మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,13,338 మంది ఓటర్లు తమ హక్కు వినియోగించుకోబోతున్నారు. ఈ ఉప ఎన్నిక ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌కు పోలీసులు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపట్టారు. నియోజకవర్గంలో మొత్తం 279 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఎన్నికల అధికారులు. ఇందులో భాగంగా 1,339 మంది జనరల్‌, 1032 మంది పోలీస్‌ సిబ్బందిని నియమించారు. అంతే కాకుండా 142 మంది మైక్రో అబ్జర్వర్లు, 38 మంది సెక్టార్‌ ఆఫీసర్స్‌ కూడా విధుల్లో ఉంటారు. మొత్తం 377 ఈవీఎంలను సిద్ధం చేశారు.

123 సమస్యాత్మక కేంద్రాల గుర్తింపు:

కాగా, ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో 123 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. అక్కడ ఎలాంటి అల్లర్లు, ఇతర ఘటనలు జరుగకుండా ప్రత్యేక బందోబస్తును నియమించామని రిటర్నింగ్‌ ఆఫీసర్‌, జేసీ ఎంఎన్‌ హరేందిర ప్రసాద్‌ చెప్పారు. ఓటర్లు తప్పనిసరిగా ఓటర్‌ స్లిప్‌లతో పాటు ఓటరు ఐడీ, ఆధార్‌, బ్యాంకు పాస్ బుక్‌, పాస్‌పోర్ట్‌ తదితర వాటిలో ఏదో ఒక గుర్తింపు కార్డును తప్పనిసరిగా తీసుకొచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఉప ఎన్నికలో వైసీపీ తరఫున గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డి బరిలోకి దిగగా ప్రతిపక్ష టీడీపీ పోటీకి దూరంగా ఉంది. బీజేపీ తరఫున భరత్ కుమార్ పోటీలో ఉన్నారు. వైసీపీ, బీజేపీ అభ్యర్థులతో పాటు మొత్తం 14 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. 26న కౌంటింగ్‌ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో ఆత్మకూరులో 83.38 శాతం పోలింగ్‌ జరుగగా, ఈ ఉప ఎన్నికలో ఎంత పోలింగ్‌ నమోదు అవుతుందో చూడాలి.


మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి