ఎంతకు తెగించార్రా.. రూ. 10 ఇవ్వలేదని ప్రాణం తీసిన మైనర్ బాలుడు!

విజయవాడలో చోటుచేసుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది. మద్యం తాగడానికి పది రూపాయలు ఇవ్వలేదని ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తాతాజీ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి ఆత్యంత దారుణంగా హతమార్చాడు. బాధితుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటన విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు దర్యాప్తు చేపట్టిన పోలీసులు గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేశారు.

ఎంతకు తెగించార్రా.. రూ. 10 ఇవ్వలేదని ప్రాణం తీసిన మైనర్ బాలుడు!
Brutally Murder In Vijayawada

Edited By:

Updated on: Dec 19, 2025 | 7:29 PM

విజయవాడలో చోటుచేసుకున్న దారుణం వెలుగులోకి వచ్చింది. మద్యం తాగడానికి పది రూపాయలు ఇవ్వలేదని ఓ బాలుడు దారుణానికి ఒడిగట్టాడు. తాతాజీ అనే వ్యక్తిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి ఆత్యంత దారుణంగా హతమార్చాడు. బాధితుడు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఈ ఘటన విజయవాడలో తీవ్ర సంచలనం సృష్టించింది.

విజయవాడ చిట్టినగర్‌ ప్రాంతంలో దారుణ హత్య ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా నులకపేటలో తాతాజీ అనే వ్యక్తి నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం (డిసెంబర్ 18) రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి హత్య చేశారు. అర్ధరాతి సమయంలో జరిగిన ఘటనపై పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో ఉన్న తాతాజీ మృతదేహాన్ని గుర్తించి, పోస్టుమార్టం నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ప్రాథమిక సమాచారంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

హత్య కేసును చాలెంజ్‌గా తీసుకున్న భవానీపురం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కేసును ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీలు, స్థానికుల సమాచారం ఆధారంగా విచారణ కొనసాగించారు. కొన్ని గంటలలోనే నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అయితే పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం తాగేందుకు పది రూపాయలు ఇవ్వాలని మృతుడు తాతాజీని మైనర్ బాలుడు అశ్రయించినట్టు తెలిసింది.

తాతాజీ డబ్బులు ఇవ్వకుండా పిల్లాడిని మందలించాడు. దీంతో కోపంతో రగిలిపోయిన మైనర్ బాలుడు, కత్తితో తాతాజీపై దాడి చేసి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. హత్య చేసిన మైనర్ బాలుడిని కొత్తపేట పోలీసులు అదువులోకి తీసుకున్నారు. నేరస్తుడిగా గుర్తించిన నేపథ్యంలో బాలుడిని జువెనైల్ జస్టిస్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. కాగా, రెండు రూపాయలు, పది రూపాయల వంటి చిన్న, చిన్న విషయాలకే ప్రాణాలు తీసే స్థాయికి పరిస్థితులు దిగజారడం పట్ల స్థానిక ప్రజలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళల్లో పోలీసుల గస్తీ పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..