
ఆంధ్రప్రదేశ్ మద్యం మార్కెట్‌ని ఒక్కసారి విశ్లేషిస్తే అనేక ఆసక్తికర అంశాలు బయటపడుతున్నాయి. 2019-24 మధ్య వైసీపీ ప్రభుత్వం దశల వారీగా మధ్యనిషేధం పేరుతో బ్రాండెడ్ మద్యాన్ని దూరం చేసింది. అంతేకాకుండా పేదలు మద్యానికి దూరంగా ఉండాలంటే ధరలు ఎక్కవగా ఉండాలంటూ రేట్లు పెంచడంతో పాటు మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించింది. దీంతో బ్రాండెడ్ లిక్కర్ సేల్ గణనీయంగా తగ్గిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం తెచ్చిన కొత్త పాలసీతో బ్రాండెడ్ మద్యం అమ్మకాల్లో ఊహించని స్థాయిలో మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ఏడు శాతం ఉన్న బ్రాండెడ్ మద్యం అమ్మకాలు ప్రస్తుతం 56 శాతానికి పెరిగాయి.
వాస్తవానికి 2024 జూన్ నాటికి రాష్ట్రంలోని మొత్తం మద్యం అమ్మకాల్లో బ్రాండెడ్ లిక్కర్ వాటా కేవలం 7శాతం మాత్రమే ఉండేది. కానీ 2025 జూన్ నాటికి అదే వాటా ఏకంగా 56 శాతానికి చేరింది. ఇది 700శాతం పెరుగుదల అన్నమాట. ఇది కేవలం గణాంకం మాత్రమే కాదు. పాలసీ, వినియోగ, మార్కెట్ స్వభావం అన్నింటినీ ప్రతిబింబించేదని విశ్లేషకుల అభిప్రాయం.
వైసీపీర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో బ్రాండెడ్ మద్యం వినియోగాన్ని ‘లగ్జరీ’గా పరిగణించి, అధిక ధరలు, తక్కువ లభ్యత ద్వారా గణనీయంగా తగ్గించారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తరకం బ్రాండ్ల మద్యాన్ని అందుబాటులో పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు ఆశ్చర్యపోయేవారు. నాణ్యతపై రకరకాల కామెంట్లు వచ్చేవి. అదే సమయంలో ఆటోమేటెడ్ లిక్కర్ సప్లై వ్యవస్థను నిలిపివేసి మాన్యువల్ విధానానికి వెళ్లారు. దీని వల్ల కొందరికి మాత్రమే లాభం చేకూరిందనే విమర్శలు ఉన్నాయి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల డిమాండ్ ప్రకారంగా బ్రాండెడ్ లిక్కర్‌ను అందుబాటులోకి తేవడమే కాకుండా, ఆటోమేటెడ్ ఇండెంట్ సిస్టమ్‌ను మళ్లీ ప్రవేశపెట్టింది. ఏ ప్రాంతంలో ఏ బ్రాండ్‌కు డిమాండ్ ఎక్కువగా ఉందో ఆ బ్రాండ్ సరఫరా జరుగుతోందని చెబుతోంది. కస్టమర్ డిమాండ్ ఆధారంగా సరఫరా జరిగే విధానానికి మార్కెట్ సహకరించడంతో, బ్రాండెడ్ అమ్మకాలు ఊహించని స్థాయికి చేరినట్టు ప్రభుత్వం చెప్పుతోంది.
గత ప్రభుత్వ హయాంలో 68 శాతంగా ఉన్న చిన్న బ్రాండ్ల మార్కెట్ షేర్ ఇప్పుడు కేవలం 7 శాతానికి పడిపోయింది. ఇది అత్యంత ఆసక్తికరమైన మార్పు. మార్కెట్‌లో ఏ సరఫరాదారుడు 20 శాతానికి మించి వాటా కలిగి లేకపోవడం విశేషం.
యునైటెడ్ స్పిరిట్స్ (జానీ వాకర్, బ్లాక్ డాగ్, మెక్‌డోవెల్స్ నెం.1): అమ్మకాలు 15 రెట్లు పెరిగాయి
రాడికో ఖైతాన్ (రాయల్ స్టాగ్, మ్యాజిక్ మూమెంట్స్): అమ్మకాలు 160శాతం పెరిగాయి
కర్నాడ్: స్వదేశీ బ్రాండ్లతో 138శాతం గ్రోత్
పూర్తి స్థాయిలో బ్రాండ్ల పునరాగమనంతో మార్కెట్ టర్న్ అయింది.
గతంలో లిక్కర్ స్కాంపై విమర్శలు వెల్లువెత్తాయి. మిథున్ రెడ్డి సహా పలువురిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు. ఇప్పుడు ఆటోమేటెడ్ విధానంతో సెంట్రలైజ్డ్ ఇన్వెంటరీ, డిమాండ్ బేస్డ్ ఇండెంటింగ్ ద్వారా పారదర్శకత తెస్తున్నామంటోంది ప్రభుత్వం.
2024 జూన్‌లో 24 లక్షల కేసుల్లో కేవలం 1.7 లక్షలు బ్రాండెడ్ లిక్కర్.
2025 జూన్‌లో మొత్తం 30 లక్షల కేసుల్లో 16.8 లక్షలు బ్రాండెడ్ లిక్కర్.
ఇష్టమైన బ్రాండ్లు దొరకకపోవడమే అక్రమ మద్యం వైపు మొగ్గు చూపడానికి కారణమని ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తుతం తొమ్మిది జిల్లాలను సారా రహిత జిల్లాలుగా ప్రకటించింది. ‘ఆపరేషన్ నవోదయం’ ద్వారా అక్రమ రవాణా, సారా తయారీపై కఠిన చర్యలు తీసుకుంది.
యునైటెడ్ స్పిరిట్స్: 0 → 11.4%
పెర్నాడ్ రికార్డ్: 0 → 7.3%
రాడికో ఖైతాన్: 6.2 → 18.3%
తిలక్‌నగర్: 8.2 → 11.4%
అలైడ్ బ్లెండర్స్: 1.4 → 7.7%
ఇన్‌బ్రూ: 1.8 → 6.6%
జాన్ డిస్టిల్లరీస్: 0 → 6.2%
ఇతర టాప్ 25 బ్రాండ్లు: 11.1 → 19.3%
చిన్న బ్రాండ్లు: 68.2% → 7.2%
మద్యం, బీర్లపై 10–100 రూపాయల తగ్గింపుతో వినియోగదారులకు నెలకి రూ.110 కోట్ల ఆదా అవుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా. ఏపీలో 87శాతం మార్కెట్ షేర్ కలిగిన 30 బ్రాండ్ల ధరలు, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుతో పోలిస్తే తక్కువగా ఉన్నాయి.
కూటమి ప్రభుత్వంలో వచ్చిన కొత్త పాలసీ మార్పుతో పాటు వినియోగదారుల అభిరుచుల్లో స్పష్టమైన మార్పు చోటు చేసుకుంది. కస్టమర్ చాయిస్, మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా అమలు చేస్తున్న పాలసీ వల్ల బ్రాండెడ్ లిక్కర్ తిరిగి అందుబాటులోకి వచ్చింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..