కళ్లు లేకున్నా ప్రేమ వెలుగే జీవితం.. అనాథను పెళ్లాడిన లక్ష జీతగాడు..!
వారిలో ఒకరు కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువు.. తల్లిదండ్రులు, తోబుట్టువులు తోడు ఉన్నారు. మరొకరు అనాథ..! అనాధాశ్రమమే ఇల్లుగా.. అక్కడున్నవారే కుటుంబంగా ఎదిగారు. కానీ.. ఇద్దరికీ విధి చిన్నచూపు చూపింది. స్పందించే హృదయముంటే.. చూపుతో పనేముంది? కన్నులు లేకున్నా ప్రేమ వెలుగే జీవితానికి దారి చూపుతుందని అనుకున్నారు.

వారిలో ఒకరు కేంద్ర ప్రభుత్వ సంస్థలో కొలువు.. తల్లిదండ్రులు, తోబుట్టువులు తోడు ఉన్నారు. మరొకరు అనాథ..! అనాధాశ్రమమే ఇల్లుగా.. అక్కడున్నవారే కుటుంబంగా ఎదిగారు. కానీ.. ఇద్దరికీ విధి చిన్నచూపు చూపింది. స్పందించే హృదయముంటే.. చూపుతో పనేముంది? కన్నులు లేకున్నా ప్రేమ వెలుగే జీవితానికి దారి చూపుతుందని అనుకున్నారు. వివాహబంధంతో ఒకటయ్యారు. విశాఖలో ఒక్కటైన అంధుల ఆదర్శ వివాహం తెలుసుకుని మీరూ మనసారా ఆశీర్వదించండి.
మ్యారేజ్ ఈజ్ మేడ్ ఫర్ హెవెన్ అంటారు. ఎస్.. నిజమే.. విశాఖలో ఓ జంట వివాహం చూస్తే ఆ పదం వాళ్లకే అంకితం అన్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే.. అంతటి విశేషం ప్రాధాన్యత ఉంది ఆ జంటలో..! కుటుంబాలు వేరు, నేపథ్యం వేరు వేరు… కానీ ఇద్దరు మనసు ఒకటే.. ఒకేలా ఆలోచించారు. వెనుదిరిగి చూడలేదు. తనకు తనలాంటి వారే జీవితంలో తోడుగా ఉండాలని అనుకొని .. ఆ కలను సాకారం చేసుకొని ఏకమయ్యారు.
ఇద్దరికీ విధి చిన్నచూపు చూపినా.. ఆ ఇద్దరూ ఏకమై జీవితాన్ని చూడాలనుకున్నారు. కళ్ళు లేకపోయినా.. స్వచ్ఛ మనసుల్లోనే రూపురేఖలను చూసుకున్నారు. మనసుంటే చాలు రూపురేఖలు ఎందుకని అనుకున్నారు. విధి చిన్న చూపు చూపి కళ్ళల్లో చీకటి నింపినా.. ఇద్దరూ ఏకమై జీవితంలో వెలుగులు నింపుకున్నారు. పెద్దలను ఒప్పించి ఒకటయ్యారు. ఏడడుగులు నడిచి మూడు ముళ్ళతో ఏకమయ్యారు. పుట్టుక నుంచి అంతత్వంలో ఉంటూ.. ప్రపంచాన్ని చూడటం మాట దేవుడు ఎరుగు.. ఇక జీవిత భాగస్వామి ఈ జన్మలో దక్కుతుందా అని అనుకున్నారు. కళ్ళు లేని మాకు.. ఇక జీవితంలో దిక్కెవరు అని అనుకున్న సమయంలో.. దేవుడు కరుణించాడు. ఇదిగో ఇలా ఆదర్శ వివాహం చేసుకున్నారు.
అలా మనసులు కలిసాయి..
విశాఖకు చెందిన శివ జ్యోతి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. పుట్టకతోనే ఆంధ్రత్వం. తల్లితండ్రులను కోల్పోయి అనాథగా ఉన్న ఆమెను ప్రేమ సమాజం అక్కున చేర్చుకుంది. దీంతో ఊహ తెలిసినప్పటి నుంచి ప్రేమ సమాజంలోనే పెరిగారు. ఇక అనంతపురం జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన రాఘవేంద్ర పుట్టకతోనే అంధుడు. తల్లి తండ్రి, తోబుట్టువు ఉన్నారు. రాఘవేంద్ర కోయంబత్తూర్ లో ఈపీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి రాఘవేంద్రకు నెలకు లక్ష రూపాయలు జీతం. తనలాగే కంటి చూపులేని తన నెచ్చెలినే జీవిత భాగస్వామిగా ఎన్నుకున్నాడు.
జన్మతః అంధుడైన ఎనుమోలు రాఘవేంద్ర బీకాం కంప్యూటర్స్ పూర్తి చేసి, ప్రస్తుతం కోయింబత్తూర్ పీఎఫ్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నారు. రాఘవేంద్ర తల్లిదండ్రులది అనంతపురం జిల్లా బుక్కపట్నం మండలం సిద్దరాంపురం. వ్యవసాయ నేపథ్యం కలిగిన వారి కుటుంబంలో రాఘవేంద్ర తనలాంటి కంటి చూపులేని అమ్మాయినే వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు. విధి వంచించినా.. ప్రేమ సమాజం పంచిన ప్రేమతో వెలిగింది శివజ్యోతి. ఇద్దరూ అక్షరాల ఆసరాగా ఎదిగారు. ఒకరికొకరు తోడుగా నిలవాలని కోరుకున్నారు.
ఇంతలో దేవుడు కలిపినట్టు.. హైదరాబాద్‌లోని చినజీయర్ స్వామి అంధుల పాఠశాలలో ఇంటర్మీడియట్ చదివారు. ఆ సమయంలోనే రాఘవేంద్ర-శివజ్యోతి మధ్య పరిచయం ఏర్పడింది. స్పందించే హృదయముంటే.. చూపుతో పనేముంది? కన్నులు లేకున్నా ప్రేమ వెలుగే జీవితానికి దారి చూపుతుందని అనుకున్నారు. అయినప్పటికీ తల్లితండ్రులు లేని తనకు కంటికి రెప్పలా చూసుకున్న ప్రేమ సమాజం పెద్దలపైనే ఆ విషయం వదిలేశారు శివ జ్యోతి. రాఘవేంద్ర మ్యారేజ్ ప్రపోజల్ చేసేసరికి.. శివ జ్యోతి తన కుటుంబ పెద్దలను అడగాలని సూచించారు. దీంతో రాఘవేంద్ర కుటుంబం.. విశాఖలోని ప్రేమ సమాజం ప్రతినిధులను సంప్రదించారు. వివాహానికి మార్గం సుగమమైందని అన్నారు ప్రేమ సమాజం అధ్యక్షుడు బుద్ధ శివాజీ.
తోబుట్టువులుగా ఉన్న అనాథల సమక్షంలోనే పెళ్లి
ఇక చెప్పేదేముంది ముహూర్తం ఫిక్స్ అయింది.. అంధులైన రాఘవేంద్ర, శివజ్యోతి ఆదివారం(మే 11) రాత్రి 7.05 నిమిషాలకు స్వాతి నక్షత్ర వృశ్చిక లగ్నంలో ఒకటయ్యారు. శివజ్యోతి చిన్ననాటి నుంచి పెరిగిన ప్రేమ సమాజంలోనే.. ఆ పెద్దలు తనలా అక్కడే ఆశ్రయం పొందుతు తోబుట్టువుల ఉన్న మరి కొంతమంది పిల్లల సమక్షంలో ఆమె రాఘవేంద్ర తో కలిసి ఏడడుగులు నడిచింది. వేద మంత్రాలు, పచ్చని తోరణాలు, భాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ, దాతల దీవెనలతో ఈ వేడుక ఘనంగా జరిగింది. అందరూ ఈ ఆదర్శ వధూవరులను ఆశీర్వదించారు. వరుడి ఇంట్లో మాట్లాడాకే.. అందరి అభిప్రాయం మేరకు వధూవరులు ఏకమయ్యారని అన్నారు ప్రేమ సమాజం ఉపాధ్యక్షుడు హనుమంతరావు.
అన్నీ తెలిసే ఇష్టపడ్డాను..
‘స్పందించే హృదయముంటే.. చూపుతో పనేముంది? కన్నులు లేకున్నా ప్రేమ వెలుగే జీవితానికి దారి చూపుతుంది. అన్నీ తెలిసే ఆమెను ఇష్టపడ్డాను.. పెళ్లి కోసం ప్రస్తావిస్తే… తనకు అన్నీ తామై చూస్తున్న ప్రేమ సమాజం పెద్దలని సంప్రదించాలని శివజ్యోతి కోరింది. నాలా ఉన్నవారిని వివాహం చేసుకోవాలని అనుకున్నా దేవుడు ఆశీర్వదించాడు’ అని వరుడు రాఘవేంద్ర అన్నారు.
నాకోసం వచ్చిన వ్యక్తే జీవితాంతం తోడుగా..
‘‘నాకు చిన్నప్పుడే తల్లిదండ్రులు కోల్పోయాను. అప్పటి నుంచి రెండు దశాబ్దాలుగా ప్రేమ సమాజమే ఆదరించింది. ప్రేమ ఆప్యాయత అనురాగం పంచారు. తల్లి లేని లోటును తీర్చారు. చూపు లేనందుకు చాలా సందర్భాల్లో సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. నాకోసం వచ్చిన నాలాంటి వ్యక్తిని నేను జీవిత భాగస్వామిగా ఉండేందుకు నిర్ణయం తీసుకుంటే.. ఇక జీవితమంతా హ్యాపీగా సాగిపోతుంది అని అనుకున్నాను. ప్రేమ సమాజం పెద్దలను కాదని ఏ నిర్ణయం కూడా తీసుకోదల్చుకోలేదు. నాకు ప్రపోజ్ చేయగానే .. నాకు జీవితం ఇచ్చిన ప్రేమ సమాజం పెద్దలను మాట్లాడాలని కోరాను.. తమలాంటి వాళ్లకి ఇంతటి ఆప్యాయత ప్రేమను పంచి వివాహం చేయడం.. రాఘవేంద్ర లాంటి గొప్ప మనసున్న వ్యక్తి జీవిత భాగస్వామిగా దక్కడం కంటే అదృష్టం ఏమంటుందని’’ భావోద్వేగంతో అంటుంది శివజ్యోతి. మాలాంటి వారి విషయంలో సమాజం ఆలోచన మారాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు వధువు శివ జ్యోతి.
చీకటి కన్నుల్లో మెరిసిన ఆ వెలుగు రేఖలు భవిష్యత్తుకు బంగారు బాటలు చూపగా.. తమ జీవితంలో కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది జంట. ఇద్దరూ ఒక్కటైన ఈ ఆదర్శ జంట నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకుందాం.. ఆల్ ది బెస్ట్..!!
మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..