
Black Magic: ప్రజల్లో పెరిగిపోతున్న మూఢనమ్మకాలు, చేతబడులు, వింతపూజలు భయందోళన కలిగిస్తున్నాయి. ప్రతి రోజూ ఎదో ఒకచోట క్షుద్రపూజలు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల వేళ పోటీలో నిలిచిన అభ్యర్థులపై ప్రత్యార్ధుతు క్షుద్రపూజలు చేయిస్తున్న ఘటనలు తీవ్రం కలవరం కలిగిస్తున్నాయి.
అనంతపురం జిల్లా కనేకల్ పట్టణంలో వైసీపీ సర్పంచ్ అభ్యర్థి డా. సోమన్న ఇంటిముందర కొందరు గుర్తు తెలియని వ్యక్తులు చేతబడి చేశారు. ఇంటి ముందు పసుపు, కుంకుమతో నిమ్మకాయలు వేసి వెళ్ళారు. మర్నాడు ఆ వింత పూజలు చూసిన సోమన్న కుటుంబీకులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఓర్వలేక కొంతమంది ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ టౌన్ కన్వీనర్ కేశవరెడ్డి. ప్రత్యర్థులకు ఇది సబబు కాదని హితవు పలికారు. అలాగే ఇలాంటి కుట్రలు ఎన్ని పన్నినా దాన్ని ఎదుర్కొని పంచాయతి ఎలక్షన్ బరిలో ఉంటామని తెలిపారు.
Also Read:
ఎంత విడ్డూరం సుమీ..! సీసీ కెమెరాకు చూపించి మరీ.. లంచం తీసుకుంది… ఆ తర్వాత ఏం జరిగిందంటే..?
సీఏ చదివిన ఈ వ్యక్తి ఎంత క్రూరుడో.. భార్య పేరుతో భారీ ఇన్సూరెన్స్ పాలసీ చేయించి.. ఆపై తుదముట్టించాడు