East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ టెర్రర్.. తాజాగా ఇద్దరు మృతి

|

Aug 08, 2021 | 11:25 AM

ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో..

East Godavari: తూర్పు గోదావరి జిల్లాలో బ్లాక్‌ ఫంగస్‌ టెర్రర్.. తాజాగా ఇద్దరు మృతి
Black Fungus
Follow us on

ఓ వైపు కరోనా ఉధృతి.. మరోవైపు బ్లాక్‌ ఫంగస్‌ కేసులు ఏపీలో కలకలం రేపుతున్నాయి. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాలో ఈ తరహా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. తాజాగా బ్లాక్‌ ఫంగస్‌తో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందడం అధికారులను కలవరపెడుతోంది. తూర్పుగోదావరిజిల్లాలో ఇప్పటివరకూ మొత్తం బ్లాక్‌ ఫంగస్‌ కేసుల సంఖ్య 391కి చేరాయి. జీజీహెచ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 276 మందిలో 221 మందికి సర్జరీలు చేశారు. 60 మంది బ్లాక్‌ఫంగస్‌తో చనిపోయారు.

ఇక బ్లాక్‌ ఫంగస్‌ ట్రీట్‌మెంట్‌ చాలా కాస్ట్‌లీగా మారింది. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో చేరితే ఇళ్లు గుల్లవుతోంది. అందుకే ప్రభుత్వాస్పత్రులకు బ్లాక్‌ ఫంగస్‌ కేసు పేషెంట్లు క్యూ కట్టారు. బ్లాక్‌ ఫంగస్‌ సోకిన ఫేషెంట్‌కి సర్జరీ చేయాలంటే సుమారు 8 లక్షలు ఖర్చవుతోంది. చికిత్స తర్వాత టాబ్లెట్స్‌కి వేలల్లో ఖర్చవుతోంది. రెండు నెలలు మందులు వాడాలంటే సుమారు లక్ష వరకూ ఖర్చవుతోంది. సర్జరీ చేయించుకున్న రోగులకు గవర్నమెంట్‌ ఆస్పత్రిలో మందులు కూడా దొరకడం లేదని బంధువులు ఆరోపిస్తున్నారు. నిరుపేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా మందులు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్‌ సర్పవరానికి చెందిన లక్ష్మి కుటుంబం కరోనాతో అష్టకష్టాలు పడింది. ఆమె భర్తకి బ్లాక్‌ ఫంగస్‌ రావడంతో ఉపాధిలేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుమారుడు కూలి పని చేస్తే వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకెళ్తున్నామని ఆమె వాపోతుంది. ఇలాంటి వ్యధలు రాష్ట్రవ్యాప్తంగా అనేకం. ఈ మాయదారి కరోనా, ఫంగస్‌లు మనకు ఎప్పుడు విముక్తి కల్పిస్తాయో, ఏమో..!

Also Read: Telangana: రియల్టర్ కిడ్నాప్.. సినిమా స్టైల్లో దుండగులను ఛేజ్ చేసి పట్టుకున్న పోలీసులు

ఉదయం థియేటర్లలో రిలీజ్.. మ్యాట్నీకే ‘SR కళ్యాణమండపం’ పైరసీ రెడీ..