BJP: ఏపీలో పొత్తులపై రాని క్లారిటీ.. ఆ విషయంలో జాగ్రత్తగా బీజేపీ అడుగులు..

ఏపీలో పొత్తుల పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ, జనసేన రంగం సిద్ధం చేసుకుంటున్నా కమలనాథుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. చంద్రబాబు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినా పవన్ కల్యాణ్‌కు మాత్రం బీజేపీ అధిష్టానం నుంచి అపాయింట్ మెంట్ అందడం లేదు.

BJP: ఏపీలో పొత్తులపై రాని క్లారిటీ.. ఆ విషయంలో జాగ్రత్తగా బీజేపీ అడుగులు..
Bjp
Follow us

|

Updated on: Feb 12, 2024 | 6:30 AM

ఏపీలో పొత్తుల పంచాయితీ ఇప్పట్లో తేలేలా కనిపించడం లేదు. బీజేపీతో కలిసి వెళ్లేందుకు టీడీపీ, జనసేన రంగం సిద్ధం చేసుకుంటున్నా కమలనాథుల నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. చంద్రబాబు బీజేపీ అగ్ర నేతలతో భేటీ అయినా పవన్ కల్యాణ్‌కు మాత్రం బీజేపీ అధిష్టానం నుంచి అపాయింట్ మెంట్ అందడం లేదు. దీంతో ఈ ట్రయాంగిల్ పొలిటికల్ పొత్తుల పంచాయితీ ముగింపు ఎప్పుడో అర్థం కాని స్థితి నెలకొంది.

ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా ఏపీలో ఇంకా టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులపై స్పష్టమైన ప్రకటన వెలువడలేదు. వైసీపీకి అడ్డుకట్ట వేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న టీడీపీ, జనసేనకు బీజేపీ అధినాయకత్వం మనసులో ఏముందో ఇంకా తెలియడం లేదు. ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు పొత్తులకు తాము సిద్ధమనే సంకేతాలను అధిష్టానానికి పంపారు. టీడీపీ, జనసేనతో కలిసి పోటీ చేయాలని భావిస్తున్నట్లు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించారు. దీంతో పొత్తులు ఖరారయ్యాయని ప్రచారం జరుగుతున్న వేళ బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి ఇంకా ఏ ప్రకటన వెలువడలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమావేశమైనా ఇంకా ఏ నిర్ణయమూ వెలువడలేదు.

కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుంటోన్న బీజేపీ సొంతంగా 370 చోట్ల గెలుస్తామంటోంది. ఎన్డీయే కూటమికి 400కు పైగా స్థానాల్లో విజయం లభించబోతోందని కమలనాథులు జోస్యం చెబుతున్నారు. రాబోయే రోజుల్లో ఎన్డీయేలోకి మరిన్ని పార్టీలు రాబోతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా కూడా వెల్లడించడంతో ఏపీలో పొత్తులపై వెంటనే ప్రకటన రావొచ్చని అంతా భావించారు. అయితే గతంలో టీడీపీ.. బీజేపీతో పొత్తు పెట్టుకుని ఆ తర్వాత నిందలు వేసి పొత్తు తెంచుకున్న నేపథ్యంలో అలా మరోసారి జరగకుండా బీజేపీ వ్యూహ రచన చేస్తోంది.

ఇవి కూడా చదవండి

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలోనూ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. జనసేన విషయంలో ఒక అంచనాకు వచ్చాక పొత్తులపై ముందుకు వెళ్ళాలని బీజేపీ చూస్తోంది. పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోరినా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇంకా పిలవకపోవడం హాట్‌ టాపిక్‌గా మారింది. మరోవైపు పొత్తుల విషయంలో బీజేపీకి స్పష్టమైన అవగాహన ఉందని ఏపీ బీజేపీ నేతలంటున్నారు. పొత్తులో భాగంగా ఎన్ని సీట్లు అన్నది తెలియలేదన్నారు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌. అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

పొత్తులపై బీజేపీ నేత ఐవైఆర్‌ కృష్ణారావు ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈసారి అవ్వ కావాలి.. బువ్వ కావాలి అంటే కుదరకపోవచ్చని ట్వీట్‌లో పేర్కొన్నారు. టీడీపీ అన్ని అంశాలపై పూర్తి స్పష్టతతో ఎన్డీఏలో చేరాల్సి ఉంటుందన్నారు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు విషయంలో పూర్తి స్పష్టత వచ్చాకే ముందుకు వెళ్ళేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది బీజేపీ కేంద్ర నాయకత్వం. మరోవైపు ఎన్నికలకు గడువు సమీపిస్తున్న తరుణంలో పొత్తులపై త్వరగా ప్రకటన వెలువడాలని మూడు పార్టీల క్యాడర్‌ కోరుకుంటోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
నీతి ఆయోగ్‌ భేటీకి బాబు.. రేవంత్ హాజరవుతారా..?
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఆ వంద నోట్లతో హైదరాబాద్ సగం కొనేద్దామనుకున్నా.. టాలీవుడ్ హీరో..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
ఇంటి అద్దెకు సమానంగా క్యాబ్‌ ఛార్జీలు.. వైరల్‌ అవుతోన్న పోస్ట్‌..
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
కొనసాగుతోన్న బంగారం ధర పతనం.. తులం ఎంతకు చేరిందో తెలుసా.?
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
ఓటీటీలోకి వచ్చేసిన జాన్వీ కపూర్ స్పోర్ట్స్ డ్రామా..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
Horoscope Today: వ్యక్తిగత సమస్యల నుంచి వారికి విముక్తి..
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
పాకిస్తాన్‌కు షాక్.. ఆసియాకప్ ఫైనల్‌కు లంక.. భారత్‌తో అమీతుమీ
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
'పాక్ కు రండి బ్రో.. పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం': షోయబ్ మాలిక్
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సంచలన విషయాలు బయటపెట్టిన చిన్మయి
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్‌లో కుండపోత వానలు
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
గోల్డ్‌పై పెట్టుబడులు పెట్టేవారికి గుడ్‌న్యూస్‌.! ఇదే సరైన సమయం.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
భూమ్మీద నూకలున్నాయ్‌. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన పాప.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
నేను ఇప్పటికీ తెలుగులో మాట్లాడేందుకు తడబడుతున్నా.. నారా లోకేష్.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
భారీ వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం.. మూడు రాష్ట్రాలకు భారీ వర్షాలు.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
చేపల వేటకు వెళ్లిన బోటుపై తిమింగలం దాడి.. వీడియో వైరల్.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
మరక తెచ్చిన తంటా.. ప్రయాణికులను విమానం ఎక్కనివ్వని సిబ్బంది.
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
అనంత్‌-రాధికల మేకిన్‌ ఇండియా వివాహం. ఆర్థికంగా లాభపడిన వ్యాపారులు
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఒలింపిక్స్ కు పారిస్ రెడీ! మరి మన సంగతేంటి?
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
ఈ బడ్జెట్ లో.. మహిళలకు 'బంగారం' లాంటి శుభవార్త.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!
బూడిద గుమ్మడికాయ.. ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు.!