AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు

Afghanistan vs UAE : టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై 5 వికెట్ల తేడాతో రషీద్ ఖాన్ సేన ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో అఫ్గాన్లు తమ సూపర్-8 ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.

Afghanistan vs UAE : బౌలింగ్‌లో నిప్పులు.. బ్యాటింగ్‌లో మెరుపులు..రషీద్ ఖాన్ సేన నయా రికార్డు
Afghanistan
Rakesh
|

Updated on: Feb 16, 2026 | 5:04 PM

Share

Afghanistan vs UAE : టీ20 ప్రపంచకప్ 2026లో అఫ్గానిస్థాన్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. సోమవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన కీలక పోరులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పై 5 వికెట్ల తేడాతో రషీద్ ఖాన్ సేన ఘనవిజయం సాధించింది. ఈ విజయంతో అఫ్గాన్లు తమ సూపర్-8 ఆశలను సజీవంగా ఉంచుకున్నారు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో ఓడిపోయి ఉంటే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చేది. నిన్న భారత్ చేతిలో పాకిస్థాన్ ఓడిపోవడంతో సంబరాలు చేసుకున్న అఫ్గాన్ అభిమానులకు, నేడు తమ జట్టు గెలుపు మరింత జోష్ ఇచ్చింది. టాస్ గెలిచిన అఫ్గానిస్థాన్ జట్టు మొదట యూఏఈని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అఫ్గాన్ పేసర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ నిప్పులు చెరిగే బౌలింగ్‌తో యూఏఈ బ్యాటర్లను వణికించాడు. కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి యూఏఈ నడ్డి విరిచాడు. యూఏఈ ఆటగాళ్లలో శోయబ్ ఖాన్ (68), అలీషాన్ షరాఫు (40) మాత్రమే రాణించడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేయగలిగింది. ముజీబ్ ఉర్ రెహ్మాన్ రెండు వికెట్లు తీయగా, కెప్టెన్ రషీద్ ఖాన్ ఒక వికెట్ సాధించాడు.

161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గాన్ జట్టుకు ఆదిలోనే షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్ అయి పెవిలియన్‌కు చేరాడు. అయితే మరో ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ (53) బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును ఆదుకున్నాడు. బౌలింగ్‌లో మెరిసిన ఒమర్జాయ్, బ్యాటింగ్‌లోనూ మెరుపులు మెరిపించాడు. కేవలం 21 బంతుల్లోనే 40 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. దీంతో మరో 4 బంతులు మిగిలి ఉండగానే అఫ్గానిస్థాన్ లక్ష్యాన్ని ఛేదించింది.

గ్రూప్-డి పాయింట్ల పట్టికలో ప్రస్తుతం సౌతాఫ్రికా వరుసగా మూడు విజయాలతో అగ్రస్థానంలో ఉండి ఇప్పటికే సూపర్-8కు అర్హత సాధించింది. రెండో స్థానంలో న్యూజిలాండ్ ఉండగా, తాజా విజయంతో అఫ్గానిస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. అఫ్గాన్లు తమ తర్వాతి మ్యాచ్‌లో కెనడాపై కచ్చితంగా గెలవాల్సి ఉంటుంది. అదే సమయంలో న్యూజిలాండ్ తన చివరి మ్యాచ్‌లో కెనడా చేతిలో ఓడిపోతే, రన్ రేట్ ప్రాతిపదికన అఫ్గానిస్థాన్ సూపర్-8కు వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో ఈ గ్రూప్ లో పోటీ ఇప్పుడు రసవత్తరంగా మారింది.

గత కొన్నేళ్లుగా అఫ్గానిస్థాన్ జట్టు పసికూన స్థాయి నుంచి దిగ్గజ జట్లను ఓడించే స్థాయికి ఎదిగింది. స్పిన్ బౌలింగ్‌కు పేరుగాంచిన ఈ జట్టులో ఇప్పుడు పవర్‌ఫుల్ హిట్టర్లు, వేగవంతమైన పేసర్లు కూడా తోడయ్యారు. ముఖ్యంగా ఒమర్జాయ్ వంటి ఆల్‌రౌండర్లు జట్టుకు వెన్నెముకలా మారుతున్నారు. గ్రూప్ దశ దాటి సూపర్-8లో అడుగుపెడితే అఫ్గాన్ జట్టు ఏదైనా అద్భుతం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us