AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: రైళ్ల ద్వారా ఏసీ, ఫ్రిజ్ లాంటి పరికరాలు పంపించవచ్చా..? రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?

భారతీయ రైల్వే పార్శిల్ సేవలు అందిస్తోంది. మీరు వస్తువులను ట్రైన్ల ద్వారా పంపించవచ్చు. మీరు ఒక నగరం నుంచి మరొ నగరానికి వెళ్లేటప్పుడు ఇంట్లోని సామాన్లను ట్రైన్ల ద్వారా పంపించవచ్చు. అసలు ఈ ప్రాసెస్ ఏంటి.. ఎలా పంపించాలి? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం.

Indian Railways: రైళ్ల ద్వారా ఏసీ, ఫ్రిజ్ లాంటి పరికరాలు పంపించవచ్చా..?  రూల్స్ ఏం చెబుతున్నాయంటే..?
Indian Railways
Venkatrao Lella
|

Updated on: Jun 13, 2026 | 6:48 PM

Share

రైలు ప్రయాణాన్ని ఇష్టపడివారంటూ ఎవరూ ఉండరు. ట్రైన్లో విశాలంగా ఉంటుంది. అందుకే సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. అదే బస్సు, కార్లలో కాస్త ఇరుకుగా అనిపిస్తుంది. దూరపు ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే ఎంచుకుంటారు. ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని హాయిగా ట్రైన్లలో ప్రయాణిస్తారు. అయితే ట్రైన్లలో మనం ట్రావెల్ చేయడమే కాకుండా వస్తువులను కూడా పార్శిల్ చేయవచ్చు. చాలామంది ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత కారణాల వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి షిప్ట్ అవుతుంటారు. ఇలాంటి సమయంలో ఇంట్లోని సామాన్లను తీసుకెళ్లడం అనేది ఖర్చుతో కూడుకున్న పని. ప్రైవేట్ రవాణా సంస్థ ద్వారా తీసుకెళ్లాలంటే చాలా ఖర్చు అవుతుంది. వేలకు వేలు డబ్బులు ఖర్చవుతాయి.

రైల్వే పార్శిల్ సర్వీస్

రైల్వే శాఖ పార్శిల్ సేవలు అందిస్తోంది. ఈ సేవల ద్వారా మీరు వస్తువులు, సామాన్లను తీసుకెళ్లవచ్చు. వాషింగ్ మెషిన్, ఏసీ, ఫ్రిడ్జ్, ఫర్నిచర్ లాంటి వస్తువులతో పాటు బైక్, ఇతర వస్తువులను తక్కువ ధరతో ఈ సేవల ద్వారా తీసుకెళ్లవచ్చు. ప్రైవేట్ రవాణా సంస్థలతో పోలిస్తే వీటిల్లో ఛార్జీలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఏసీ, ఫ్రిడ్జ్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్యాక్ చేసుకోవాలి. బబుల్ ర్యాప్, థర్మోకోల్ షీట్లు, బలమైన కార్టన్ పెట్టెలు, అదనపు కుషనింగ్ మెటీరియల్‌ లాంటివి ఉపయోగించి ప్యాక్ చేసుకోవాలి. ఆ తర్వాత సమీపంలోని రైల్వే స్టేషన్‌లో ఉన్న పార్శిల్ ఆఫీస్‌కు వెళ్లి బుక్ చేసుకోవాలి. అక్కడ మీ సామాన్లను తూకం వేశాక దూరాన్ని బట్టి ఛార్జీలను నిర్ణయిస్తారు. ఆ తర్వాత మీ గుర్తింపు కార్డు, సామాన్లను స్వీకరించే వ్యక్తి సమాచారం నమోదు చేసుకుంటారు. అనంతరం మీకు ఒక స్లిప్ అందిస్తారు. ఆ స్లిప్‌ను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. గమ్యస్థానానికి సామాన్లు చేరుకున్న తర్వాత వాటిని తీసుకునేందుకు ఈ స్లిప్ ఉపయోగపడుతుంది. మీరు ఏసీ, ఫ్రిడ్జ్ లాంటివి పంపింస్తుంటే అందులోని గ్యాస్ లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

జాగ్రత్తలు తీసుకోండి..

వస్తువుల సైజు పెద్దగా ఉంటే వాల్యూమెట్రిక్ బరువు ఆధారంగా ఛార్జీలు విధిస్తారు. దీంతో దూరం, వస్తువుల బరువును బట్టి ఛార్జీలు ఉంటాయి. వాటిని ముందుగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రైవేట్ సంస్థలతో పాటు రుసుంలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ వస్తువులను సరిగ్గా ప్యాక్ చేసుకోవాల్సి ఉంటుంది. దీని వల్ల మీ వస్తువులు భద్రంగా ఉంటాయి. రైళ్ల ద్వారా సామాన్లను పంపించేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.

Follow Us
2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు!ఆ రహస్యం
2,000 అండర్‌‌వేర్‌లు భూమిలో పూడ్చిపెట్టిన శాస్త్రవేత్తలు!ఆ రహస్యం
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?
కొడుకు సంపాదించిన ఆస్తిలో తండ్రికి వాటా ఉంటుందా..?
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
మూడేళ్లు ఆ డైరెక్టర్ ఇంటి చుట్టూ తిరిగా..
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
వాస్తు టిప్స్ : ఇంటి ముందు సపోటా చెట్టు ఉండటం మంచిదేనా?
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
రూ.1కే అన్‌లిమిటెడ్ కాల్స్, ఇంటర్నెట్.. ఇలాంటి ఆఫర్ ఎక్కడా ఉండదు.
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
విశ్వక్‌సేన్ 'కల్ట్' షూటింగ్ పూర్తి.. గ్రాండ్ రిలీజ్ ఎప్పుడంటే?
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
అదృష్టం అంటే ఇదే! రూ.2,800 పెయింటింగ్‌కు వేలంలో రూ.13 కోట్ల ధర!
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
చివరి చివరి కోరిక తీరకుండానే కన్నుమూసిన సింగీతం
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
భక్తులకు బిగ్‌ అలర్ట్.. ఇకపై తిరుమలలోకి ఈ వాహనాలకు నో ఎంట్రీ!
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే
లక్కంటే బుమ్రా, దూబేదే..ఫైనల్ వస్తే చాలు వీరు కప్పు కొట్టాల్సిందే