Andhra Pradesh: ‘ఏపీలో అభివృద్ధి లేదు.. అన్నీ సాములే’.. జగన్ సర్కార్‌పై నడ్డా తీవ్ర విమర్శలు..

|

Jun 10, 2023 | 8:08 PM

వైసీపీ ప్రభుత్వంపై జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి.. స్కామ్‌లు నడుస్తాయని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందన్నారు. శాంతి భద్రతలు అదుపుతప్పాయని అన్నారు. శ్రీకాళహస్తి వేదికగా జరిగిన బీజేపీ మహాసంపర్క్‌ అభియాన్‌ సభలో వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు జేపీ నడ్డా.

Andhra Pradesh: ‘ఏపీలో అభివృద్ధి లేదు.. అన్నీ సాములే’.. జగన్ సర్కార్‌పై నడ్డా తీవ్ర విమర్శలు..
Jp Nadda
Follow us on

వైసీపీ ప్రభుత్వంపై జేపీ నడ్డా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో అభివృద్ధి నిలిచిపోయి.. స్కామ్‌లు నడుస్తాయని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందన్నారు. శాంతి భద్రతలు అదుపుతప్పాయని అన్నారు. శ్రీకాళహస్తి వేదికగా జరిగిన బీజేపీ మహాసంపర్క్‌ అభియాన్‌ సభలో వైసీపీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు జేపీ నడ్డా.

ప్రధాని పాలనపై ప్రశంసలు..

ప్రధాని మోదీ ఎప్పుడూ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ను బాధ్యతాయుత పాలిటిక్స్‌ వైపు మళ్లించారన్నారు. దేశమంతా అభివృద్ధి జరగాలనే విధానం వైపు మోదీ మొగ్గు చూపారని తెలిపారు. పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోందన్నారు. వైసీపీ సర్కార్‌ అవినీతిలో కూరుకుపోయిందని మండిపడ్డారు. మైనింగ్‌, శ్యాండ్‌, లిక్కర్‌, ల్యాండ్‌, ఎడ్యుకేషన్‌ ఒకటేమిటి.. అన్నీ స్కామ్‌లు జరిగాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు జేపీ నడ్డా.

రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని విమర్శించారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు. ఏపీకి ప్రధాని మోదీ ఏం చేస్తున్నారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ ఇచ్చే బియ్యంపై కూడా జగన్‌ తన ఫొటోలు వేసుకుంటున్నారని విమర్శించారు.

ఇవి కూడా చదవండి

ఆ పార్టీలతోనే రాష్ట్రానికి న్యాయం: కిరణ్ కుమార్ రెడ్డి

ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రానికి నష్టమేనన్నారు మాజీ సీఎం, బీజేపీ నేత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి. జాతీయపార్టీలో ఉంటేనే రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని భావించానన్నారు. ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి జరుగుతుందన్నారు కిరణ్‌కుమార్‌రెడ్డి. ఇదిలాఉంటే.. మహా అభియాన్‌ సంపర్క్‌ పేరుతో ఏపీలో బీజేపీ భారీ బహిరంగసభలు నిర్వహిస్తోంది. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గంలో జాతీయనేతలను ఆహ్వానించి సభలు నిర్వహించి.. మోదీ 9 ఏళ్ల సర్కార్‌ సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించాలని భావిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..