Andhra pradesh: ఏపీ రాజకీయాల్లో మరో వివాదం.. గుంటూరు జిన్నా టవర్‌ పేరు మార్చాలంటూ..

Andhra pradesh: నిత్యం ఏదో ఒక వివాదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోన్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తాజాగా మరో కాంట్రవర్సీకి బీజం పడింది. ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు మద్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి..

Andhra pradesh: ఏపీ రాజకీయాల్లో మరో వివాదం.. గుంటూరు జిన్నా టవర్‌ పేరు మార్చాలంటూ..

Updated on: Dec 30, 2021 | 12:56 PM

Andhra pradesh: నిత్యం ఏదో ఒక వివాదానికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారుతోన్న ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తాజాగా మరో కాంట్రవర్సీకి బీజం పడింది. ఏపీ బీజేపీ అధ్యక్షడు సోము వీర్రాజు మద్యంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇంకా కొనసాగుతున్న సమయంలోనే ఇప్పుడు మరో కాంట్రవర్సీకి ఆజ్యం పోశారు బీజేపీ జాతీయ స్థాయి నేత సత్యకుమార్.. తాజాగా ఆయన గుంటూరు జిన్నా టవర్‌పై చేసిన ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది.

వివరాల్లోకి వెళితే.. గుంటూరు పట్టణంలో ఉన్న జిన్నా టవర్‌ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసిన బీజేపీ నేత సత్య కుమార్‌.. ‘ఈ టవర్‌కు జిన్నా పేరు మీద నామకరణం చేశారు. అంతేకాకుండా ఈ ఏరియాను జిన్నా సెంటర్‌గా పిలుస్తారు. ఇది ఉంది పాకిస్థాన్‌లో కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరులో. దేశ ద్రోహి అయిన అలీజిన్నా పేరును ఇంకా టవర్‌కు కొనసాగిస్తున్నారు. ఈ టవర్‌కు భరత మాత ముద్దు బిడ్డ అయిన అబ్దుల్‌ కలాం పేరో, దళిత రచయిత గుర్రం జాషువా పేరు ఎందుకు పెట్టరు.? ఒక సూచనగా చెబుతున్నాను’ అంటూ రాసుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఈ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. మరి ఈ ట్వీట్‌తో పుట్టిన వేడి ఇక్కడితో ఆగిపోతుందా.? లేదా కొనసాగుతుందా.. చూడాలి.

పేరు మార్చక పోతే.. టవర్‌ను కూల్చేయండి: రాజాసింగ్‌

ఇదిలా ఉంటే సత్య కుమార్‌ చేసిన ట్వీట్‌కు బిజేపీ నేతల నుంచి రియాక్షన్స్‌ మొదలయ్యాయి. ఈ విషయమై తెలంగాణ బీజేపీ నాయకుడు, గోషా మహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వెంటనే జిన్నా సెంటర్‌ పేరు మార్చాలని డిమాండ్‌ చేసిన రాజాసింగ్‌.. ప్రభుత్వం స్పందించకపోతే బీజేపీ కార్యకర్తలు జిన్నా టవర్‌ను కూలగొట్టండి అంటూ కామెంట్‌ చేశారు. వెంటనే ఆ పేరును తొలిగించి స్వతంత్ర్య యోధుల పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Also Read: Ayyappa Prasadam: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. ఈ ఏడాది ఇంటి వద్దకే ప్రసాదం.. ఎలా పొందాలంటే..

RamCharan: ఆ సినిమాలకు రామ్‌ చరణ్ భారీ రెమ్యునరేషన్‌ !.. నెట్టింట్లో ఆసక్తికర చర్చ..