నల్లమల అడవిలో అనుకోని అతిథి.. చూసి షాకైన అటవీ సిబ్బంది..

150 ఏళ్ల క్రితం అంతరించి పోయింది అనుకున్న అడవి జంతువు జాతి మళ్ళీ ప్రత్యక్షమైంది. దీంతో వన్యప్రాణి ప్రేమికుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. నల్లమల అభయారణ్యంలో ఆ జాతి జంతువు సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారుల కంటపడింది. ఆ అరుదైన జంతువును ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. అనుకోని అతిధి నల్లమలకు చేరింది. జీవ వైవిధ్యంతో అలరారుతున్న నాగార్జునసాగర్ శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో వింత జంతువు కనిపించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ భైర్లుటి రేంజ్‎లో అడవి దున్న ప్రత్యక్షమైంది.

నల్లమల అడవిలో అనుకోని అతిథి.. చూసి షాకైన అటవీ సిబ్బంది..
Nandyala Forest

Edited By:

Updated on: Jul 02, 2024 | 11:45 AM

150 ఏళ్ల క్రితం అంతరించి పోయింది అనుకున్న అడవి జంతువు జాతి మళ్ళీ ప్రత్యక్షమైంది. దీంతో వన్యప్రాణి ప్రేమికుల సంతోషానికి అవధులు లేకుండా పోయింది. నల్లమల అభయారణ్యంలో ఆ జాతి జంతువు సంచరిస్తుండగా అటవీ శాఖ అధికారుల కంటపడింది. ఆ అరుదైన జంతువును ప్రత్యక్షంగా చూసి నిర్ధారించుకుని ఆశ్చర్యానికి గురయ్యారు. అనుకోని అతిధి నల్లమలకు చేరింది. జీవ వైవిధ్యంతో అలరారుతున్న నాగార్జునసాగర్ శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యంలో వింత జంతువు కనిపించింది. నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్ భైర్లుటి రేంజ్‎లో అడవి దున్న ప్రత్యక్షమైంది. నల్లమల అడవుల్లో సుమారు 150 సంవత్సరాల క్రితం అదృశ్యమైన అడవి దున్న జాతి (బైసన్ )తిరిగి కనిపించడంతో వన్యప్రాణి ప్రేమికులు సంతోషాన్ని, ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

నల్లమల అడవుల్లో 1870 కాలంలో అడవి దున్నలు (ఇండియన్ బైసన్)గా ప్రసిద్ధి చెందినవని అధికారులు చెబుతున్నారు. ఒకప్పుడు ఈ దున్నలు నల్లమల అడవిలో విస్తారంగా తిరిగేవని చెబుతున్నారు. అనూహ్యంగా 1870 ప్రాంతంలో అదృశ్యమైన అడవి దున్నసుమారు 150 ఏళ్ల తర్వాత మళ్లీ నల్లమలలో ప్రత్యక్షం కావడం విశేషం. కాగా ప్రస్తుతం నల్లమలకు పాపికొండలు ( పోలవరం అటవీ ప్రాంతం).. కర్ణాటకలోని పశ్చిమ కనుమలలో మాత్రమే వుండే అడవి దున్న వేల కిలోమీటర్లు దాటుకొని నల్లమలకు రావడం ఒక అద్భుతమే అంటున్నారు అటవీశాఖ అధికారులు. నంద్యాల ఫారెస్ట్లో కనిపించిన ఈ అడవి దున్నను వీడియో తీసేలోపూ పారిపోయిందని చెబుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..