వేసవి కాలం ప్రారంభంలోనే ఎండలు అల్లాడించేస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో ఎండ తీవ్రతకు పల్సర్ బైక్ దగ్దమైపోయింది. జిల్లాలోని పలాస సమీపంలో 16వ నంబర్ జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తుండగా షార్ట్ సర్క్యూట్ జరిగి బయట ఉన్న ఎండ తీవ్రత దానికి తోడై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పలాస మండలం రామకృష్ణాపురం గ్రామానికి చెందిన తిమ్మల విశ్వనాథం అనే వ్యక్తి పల్సర్ బైక్ పై పలాస నుండి స్వగ్రామానికి వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రయాణిస్తున్న బైక్ నుండి మంటలు ఒక్కసారిగా రావటంతో వెంటనే బైకును ఆపి విశ్వనాథం పరుగులు తీశాడు. క్షణాల్లో మంటలు బైక్ మొత్తం వ్యాపించి కల్ల ముందే బైక్ మొత్తంగా తగలబడిపోయింది. ఎండ తీవ్రతకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ వాహనాలను నీడపట్టున పార్క్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తూన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.