Chandrababu Cabinet 2024: పదవులు- పంపకాలు..! ఏపీ కేబినెట్‌ కూర్పు ఎలా ఉండబోతోంది?

|

Jun 11, 2024 | 6:51 PM

ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరబోతోంది. ఏపీ ఎన్డీఏ పక్షనేతగా ఎన్నికైన చంద్రబాబు.. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. మరి కూటమికి సంబంధించి కేబినెట్‌ కూర్పు ఎలా ఉండబోతోందన్నదే ఆసక్తి రేపుతున్న అంశం. ఇందులో ఏ ఈక్వేషన్స్‌ పనిచేయబోతున్నాయ్‌.. ఏ ఫార్ములా ప్రకారం కేబినెట్‌ బెర్త్‌లు కన్ఫామ్‌ కాబోతున్నాయ్‌.. అన్నదే బిగ్‌ డిబేటబుల్‌ పాయింట్‌ అవుతోంది.

Chandrababu Cabinet 2024: పదవులు- పంపకాలు..! ఏపీ కేబినెట్‌ కూర్పు ఎలా ఉండబోతోంది?
Big News Big Debate
Follow us on

ఏపీలో ఎన్డీఏ పక్ష నేతగా చంద్రబాబు ఎన్నికయ్యారు. అమరావతిలో జరిగిన ఎన్డీఏపక్షాల సమావేశంలో.. దీనిపై ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు కూటమి ఎమ్మెల్యేలు. రాష్ట్ర ప్రగతికోసం.. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.. అటు, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ… గవర్నర్‌ను కలిసి విన్నవించారు కూటమి నేతలు. బుధవారం అతిరథుల సమక్షంలో.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు చంద్రబాబు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లూ పూర్తయిపోయాయి.

అయితే, కూటమి ప్రభుత్వంలో కేబినెట్‌ కూర్పు ఎలా ఉండబోతోందన్నదే ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. కుల ఈక్వేషన్స్‌ పనిచేస్తే.. ఏ సామాజిక వర్గానికి ఎన్ని కేబినెట్‌ పోస్టులు వస్తాయన్నది ఆసక్తిరేపుతోంది. సీనియార్టీ ప్రకారం లెక్కలువేసి మంత్రిపదవుల పంపకం జరిగితే.. ఏ పార్టీకి ఎన్ని దక్కుతాయన్నదీ కీలకంగా మారింది.

బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ లైవ్ వీడియో చూడండి..

అన్ని ప్రాంతాలకూ కేబినెట్‌లో సముచిత స్థానం కల్పించేలా కూర్పు జరిగితే ఎవరెవరికి చాన్స్‌ ఉంటుందనేదీ చర్చనీయాంశంగా మారింది. ఇక, కూటమిలో పార్టీలు సాధించిన సీట్ల ప్రకారం కేబినెట్‌ బెర్తులను ఖరారవుతాయా? అనేదీ ప్రధానాంశమే అవుతుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కోటాలో ఏ పార్టీకి ఛాన్సు దక్కనుందనేది కూడా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర కేబినెట్‌లో చేరలేదు కాబట్టి.. రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు ప్రియారిటీ ఉంటుందా? బీజేపీలో ఎవరిని పదవివరిస్తుంది? అనేదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది. అయితే, ఆశావహుల లిస్టు మాత్రం చాంతాడంత ప్రచారంలో ఉండటం విశేషం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..