Bhimavaram Apartment in West Godavari: పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఆపార్ట్‌మెంట్లు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. భారీ వర్షాలకు తడిసి కూలిపోయే స్థితికి చేరుకున్నాయి. భీమవరం పట్టణంలోని శ్రీ శ్రీనివాస ఆపార్ట్‌మెంట్ మరీ దయనీయంగా తయారైంది. ఇది గమనించిన అపార్ట్‌మెంట్ వాసులు జాకీల సాయంతో స్లాబ్‌ను పైకి లేపారు. నిర్మాణంలో నాణ్యత లేకుండా ఆపార్ట్‌మెంట్ల నిర్మాణం జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ఎప్పుడు కూలిపోతాయోనని బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరి కొందరు ఆందోళనతో అపార్ట్‌మెంట్‌లోని ప్లాట్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
కాగా, గత కొద్దిరోజులుగా భవన ఊగిపోతూ కనిపిస్తుండటంతో అపార్ట్‌మెంట్ వాసులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అపార్డ్‌మెంట్ కుంగిపోతుండటంపై రెండు రోజుల క్రితమే ప్లాట్స్ యజమానులను ఫిర్యాదులు అందాయని. దీంతో యాజమానులకు నోటీసులు జారీ చేశామని భీమవరం మున్సిపల్ కమిషనర్ శ్యామల తెలిపారు. తక్షణం ప్లాట్లు ఖాళీ చేసి, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించామన్నారు. నిపుణులను పిలిచి అపార్ట్‌మెంట్ నివాసయౌగ్యమా కాదో తేలుస్తామని కమిషనర్ తెలిపారు. ఇదిలావుంటే, ఇప్పటి వరకు బిల్డర్‌పై ఎలాంటి ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది.
Read Also.. Telangana: గుడ్ న్యూస్.. తెలంగాణలో మరికొన్ని కొత్త మండలాల ఏర్పాటు.. నెరవేరిన చిరకాల కోరిక..