Tiger Tension: మకాం మార్చి ఆ జిల్లా వాసులను భయపెడుతున్న బెంగాల్ టైగర్.. ఆవుపై దాడి

|

Aug 25, 2022 | 10:52 AM

విజయనగరం జిల్లాలో గడిచిన నెల రోజులుగా జిల్లావాసులను రాయల్ బెంగాల్ టైగర్ వణికిస్తూనే ఉంది. పట్టుకోండి చూద్దాం అంటూ అటవీశాఖ అధికారులతో దాగుడుమూతలను ఆడుతోంది ఈ పెద్దపులి.

Tiger Tension: మకాం మార్చి ఆ జిల్లా వాసులను భయపెడుతున్న బెంగాల్ టైగర్.. ఆవుపై దాడి
Tiger Tension
Follow us on

Tiger Tension: మన్యం అటవీ ప్రాంతాల్లో రాయల్ బెంగాల్ టైగర్ (Royal Bengal Tiger) గత కొన్ని రోజులుగా హల్ చల్ చేస్తూనే ఉంది. నన్ను పట్టుకోండి చూద్దాం అన్న చందంగా అటవీశాఖ అధికారులకు సవాల్ విసురుతూ.. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా, విజయనగరం, విశాఖ జిల్లాల్లో సంచరిస్తోంది. తాజాగా  విజయనగరం జిల్లాలో రాయల్ బెంగాల్ టైగర్ హడలెత్తిస్తోంది. మరోసారి పంజా విసిరిన రాయల్ బెంగాల్ టైగర్.. బాడంగి మండలం అల్లు పాల్తేరు లో ఆవుపై దాడి చేసి చంపేసింది. దీంతో పరిసర ప్రాంతాల్లోని ప్రజలు ఎప్పుడు ఎవరి పై పులి దాడి చేసి ప్రాణాలు తీస్తుందో అని వణికిపోతున్నారు.పులిభయంతో కంటి మీద కునుకు లేకుండా గడుపుతున్నారు. రాత్రింబవళ్లు గ్రామాల చుట్టు పహారా కాసుకుంటూ దండోరా వేస్తూ కాలం గడుపుతున్నారు.

అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగి పులిని బంధించేందుకు కావాల్సిన చర్యలు చేపట్టారు. అయినప్పటికీ స్థానిక ప్రజల్లో మాత్రం భయానక పరిస్థితులు ఏ మాత్రం తగ్గటం లేదు. ఓ వైపు ఈ పులిని బంధించేందుకు అధికారులు స్పెషల్ బోనును తెప్పించారు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి