Andhra Pradesh: భిక్షాటన చేస్తేనే అమ్మ కటాక్షం..కోటీశ్వరులు సైతం బిచ్చమెత్తాల్సిందే..!
Andhra News: మూడు రోజులు పాటు జరిగే ఈ జాతరలో అన్నీ ప్రత్యేకతలే దర్శనమిస్తాయి. మూడ్రోజుల జాతరలో ప్రతి రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది.
East godavari district: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం(Anaparthy mandal)లో స్తతెమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా జరిగింది. మండలంలోని కొప్పవరం(Koppavram)లో మొదలైన జాతరలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మూడు రోజులు పాటు జరిగే ఈ జాతరలో అన్నీ ప్రత్యేకతలే దర్శనమిస్తాయి. మూడ్రోజుల జాతరలో ప్రతి రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది. అమ్మవారికి ప్రతిరూపమైన కత్త్రి కుండను మిద్దపై నుంచి దింపడంతో ఈ జాతర మొదలవుతుంది. కత్త్రి కుండను తలపై ధరిస్తే సంతానం కలుగుతుందని ఇక్కడి భక్తుల విశ్వాసం. ఈ కుండను తలపై ధరించేందుకు వచ్చిన మహిళలతో ఆలయ ప్రాంగణం ఏటా కిటకిటలాడుతుంటుంది. ఈ జాతర్లో మరో ప్రత్యేకత ఏటంటే అమ్మవారికి మేకలను, గొర్రెలను సమర్పిస్తారు. వేరే ఆలయాల్లో మేకలు బలి ఇవ్వడం చూస్తాం కానీ ఇక్కడ పెంచుతారు. సత్తెమ్మతల్లిని నాగదేవతగా కొలిచే భక్తులు విచిత్ర వేషాలు ధరించి.. పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు చేస్తారు. పుట్టనుంచి వచ్చే దారిలో అసలైన సందడి మొదలవుతుంది. పూజారికి కోపం తెప్పించి.. ఆయనతో దెబ్బలు తినడం ఇక్కడ ఆచారం. పూజారితో కొరడా దెబ్బలు తింటే అమ్మ కరుణిస్తుందని ఇక్కడి భక్తుల విశ్వాసం.
ఇక రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరలో అడుక్కుని మొక్కు తీర్చుకోవడం కూడా ఓ ప్రత్యేకత. ఏదో ఒక విచిత్ర వేషం ధరించి ఇక్కడ భక్తులు భిక్షాటన చేస్తారు. కోరికలు తీరిన కోటీశ్వరులు కూడా ఇక్కడ భిక్షాటన చేసి అమ్మవారికి మొక్కులు చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే భక్తుల జేబులో వున్న డబ్బు, బంగారు ఆభరణాలు కానుకలుగా ఇస్తే సత్తెమ్మ తల్లి ఆగ్రహిస్తుందని నమ్మకం. అందుకే ప్రతి ఒక్కరు ఇలా భిక్షాటన చేస్తారు. అలా వచ్చిన భిక్షాటన ద్వారా వచ్చే ఆదాయాన్ని అమ్మవారి హుండీలో వేస్తారు. అందుకోసం తెల్లవారుజాము నుండి వేషధారణలు ధరించి రోడ్లపైకి వస్తుంటారు భక్తులు.
Also Read: వాహనం ఆపగా కదులుతూ కనిపించిన గోనె సంచులు.. తనిఖీ చేసిన పోలీసులు షాక్