దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం మాములుగా లేదు. విపత్కర పరిస్థితులు నెలకున్నాయి. మరణాల సంఖ్య గుబులు రేపుతుంది. కాగా ఆక్సిజన్ కొరత దేశాన్ని కమ్ముకుంది. కరోనా కాస్త సివియర్ గా ఉన్నవారికి ఆక్సిజన్ అందించడం తప్పనిసరిగా మారింది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ మమహమ్మారి వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. మరోవైపు ఆస్పత్రుల్లో రోగుల సంఖ్య పెరగడంతో వైద్య సిబ్బంది ఒత్తిడికి గురవుతున్నారు. ఇంతమంది పేషెంట్స్ ను డీల్ చేయలేకపోతున్నారు. ఏపీలోని ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. కరోనా షెషంట్లకు చికిత్స అందించేందుకు బెడ్ల కొరత ఉంది. దీంతో ఆసుపత్రి బయట బెంచ్ ల పైన, అంబులెన్స్ లోనే ఆక్సిజన్ పెట్టి కరోనా పెషంట్ లకు చికిత్స అందిస్తున్నారు సిబ్బంది. రోగులకు సరైన చికిత్స అందిచడం లేదని, ఎవరు పట్టించుకొవటం బంధువులు ఆరోపిస్తున్నారు. కాగా ఆస్పత్రి బయట కుర్చీల్లో కూర్చుని చికిత్స తీసుకుంటున్న పేషెంట్ల విజువల్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Also Read: సామాన్యులకు గుడ్‌న్యూస్ చెప్పిన ఆర్బీఐ.. కేవైసీ రూల్స్ సవరిస్తూ కీలక నిర్ణయం