అడవుల్లో ఉండాల్సిన జంతువులు జనావాసాల్లోకి దూసుకు వస్తున్నాయి. నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎప్పుడొస్తుందో తెలీదు.. ఎటునుంచి వస్తుందో తెలీదు.. తాజాగా సిక్కోలు జిల్లాలో సమీపంలోని అడవుల్లోంచి ఊర్లోకొచ్చి.. మీరే నా టార్గెట్ అంటూ వెంటాడుతోంది ఒక ఎలుగుబంటి. సో౦పేట మ౦డల౦ ఎర్రముక్కంలో ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది. ఎక్కడ నుంచి వచ్చిందో కానీ.. తెల్లవారుజామున జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనంలోకి ప్రవేశించింది. స్కూల్ బిల్డింగ్ కిటికీ ఊసలను వ౦చి వంటగదిలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న నూనె పాకెట్స్ ని చి౦చి ఆయిల్ తాగేసింది. అంతేకాదు.. వ౦టగదిలోని బెల్లం, వేరుశెనగలును తిన్నంత తిన్న ఎలుగు బంటి.. వంట సామగ్రిని ధ్వంసం చేసి నానా హంగామా సృష్టించింది. అయితే ఎలుగు బంటిని పసిగట్టిన స్థానికులు దానిని తరిమికొట్టబోయారు. అంతే.. జనంపై విరుచుకుపడింది ఎలుగు బంటి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..