
ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో బీసీల ఓట్లపై అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న బీసీలను ఆకట్టుకోవడం ద్వారా ఎన్నికల్లో విజయం సాధించవచ్చన్న లక్ష్యంతో అన్ని పార్టీలు ముందుకెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ బీసీల పార్టీ అని ఆ పార్టీ నాయకులు చెబుతూ వస్తున్నారు. బీసీలే తమ పార్టీకి వెన్నెముక అని గుర్తు చేస్తున్నారు. గత కొంతకాలంగా బీసీల అంశాన్ని ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రస్తావిస్తున్నారు. వైఎస్ఆర్సిపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు అన్యాయం జరిగిందని.. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించాలని బీసీలకు ఇవ్వాల్సిన పథకాలను రద్దు చేశారని అనేక ఆరోపణ చేస్తున్నారు. దీంట్లో భాగంగానే వచ్చే ఎన్నికల్లో తిరిగి బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకునేలా తెలుగుదేశం – జనసేన పార్టీలు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలో జయహో బీసీ సదస్సు ద్వారా బీసీ డిక్లరేషన్ ప్రకటించాయి. టీడీపీ- జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు – పవన్ కళ్యాణ్ 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించారు. టీడీపీ – జనసేన ప్రభుత్వం అధికారంలోకి వస్తే బీసీలకు ఏం చేస్తామనే దానిపై బీసీ డిక్లేరెక్షన్‌లో పొందుపరిచారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..