Badvel By Election Result: బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలు ఏకపక్షం.. ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ అధిక్యత

|

Nov 02, 2021 | 1:44 PM

Badvel By Poll Result Counting Updates: గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బయ్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త మెజారిటీ ఆమె బీట్ చేశారు.

Badvel By Election Result: బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలు ఏకపక్షం.. ప్రతి రౌండ్‌లోనూ వైసీపీ అధిక్యత
Badvel Countng Ycp Won
Follow us on

Badvel By Election Result 2021: బద్వేల్‌ ఉప ఎన్నిక ఫలితాలు ఏకపక్షంగా సాగాయి. బద్వేల్ నియోజకవర్గం మొత్తం అధికార పార్టీ ఫ్యాన్ గాలి సుడిగాలిలా వీచింది. వైసీపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధ భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ మొదలుకుని చివరి వరకు భారీ మెజారిటీ దిశగా వైసీపీ దూసుకుపోయింది. రౌండ్ రౌండ్‌కీ ఆధిక్యం పెరిగిపోతూ వచ్చింది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్లు… రెండో రౌండ్‌లో 8,300 ఓట్లు… మూడో రౌండ్‌లో 7,879 ఓట్లు… నాలుగో రౌండ్‌లో 7,626 ఓట్లు… ఐదో రౌండ్‌లో 9,986 ఓట్లు… ఇలా అన్ని రౌండ్లలోనూ వైఎస్సార్‌సీపీకి ఓట్ల ఆధిక్యం లభించింది. బద్వేల్‌లో వైసీపీ ఘన విజయంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. స్వీట్లు పంచుకుని, డ్యాన్సులు చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

ఉప ఎన్నిక ఫలితాలు రౌండ్ల వారీగా..

రౌండ్ – 1
వైసీపీ 10478
బీజేపీ 1688
కాంగ్రెస్ 580
==========

రౌండ్ – 2
వైసీపీ 10570
బీజేపీ 2270
కాంగ్రెస్ 634
==========

రౌండ్ – 3
వైసీపీ 10184
బీజేపీ 2305
కాంగ్రెస్ 598
==========

రౌండ్ – 4
వైసీపీ 9867
బీజేపీ 2241
కాంగ్రెస్ 493
==========

రౌండ్ – 5
వైసీపీ 11783
బీజేపీ 1797
కాంగ్రెస్ 575
==========

రౌండ్ – 6
వైసీపీ 11383
బీజేపీ 1940
కాంగ్రెస్ 531
==========

రౌండ్ – 7
వైసీపీ 10726
బీజేపీ 1985
కాంగ్రెస్ 841
==========

రౌండ్ – 8
వైసీపీ 9691
బీజేపీ 1964
కాంగ్రెస్ 774
==========

రౌండ్ – 9
వైసీపీ 11354
బీజేపీ 2839
కాంగ్రెస్ 493
==========

రౌండ్ – 10
వైసీపీ 10052
బీజేపీ 1554
కాంగ్రెస్ 448
==========

రౌండ్ – 11
వైసీపీ 5139
బీజేపీ 984
కాంగ్రెస్ 223
==========

రౌండ్ – 12
వైసీపీ 483
బీజేపీ 54
కాంగ్రెస్ 14
==========

రౌండ్ – 13
వైసీపీ 362
బీజేపీ 49
కాంగ్రెస్ 26
==========

పోస్టల్‌ బ్యాలెట్స్ః

వైసీపీకి-139

బీజేపీకి 17

కాంగ్రెస్‌ 18

==========

మొత్తం ఓట్లు

వైసీపీ – 1,12,211

బీజేపీ – 21,678

కాంగ్రెస్ – 6,235
==========

మొత్తం పోలైన ఓట్లు 1,47,213

కౌంటింగ్‌లో ప్రకటించినవి-1,46,983

ఇంకా తేలనివి 230 ఓట్లు

Read Also…  Badvel By Election: బద్వేలులో ఫ్యాను సుడిగాలి.. వైసీపీ అభ్యర్ధి డాక్టర్‌ సుధా భారీ విజయం